Breaking News

‘కేజ్రీవాల్‌.. ఆ విషం పేరేంటో చెప్పు’

Published on Thu, 01/30/2025 - 18:46

ఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల తరుణంలో యమునా (yamuna) నదిపై రాజ‌కీయ రంగు పులుముకుంది. ఢిల్లీకి జీవనాడి యమునాపై బీజేపీ (bjp) విషం కక్కుతోందంటూ ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్‌ ఆద్మీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ (arvind kejriwal) వ్యాఖ్యలపై కేంద్ర హోమంత్రి అమిత్‌షా ఎదురుదాడికి దిగారు. కేజ్రీవాల్‌ చిల్లర రాజకీయాలు చేసే బదులు ఆ విషం పేరేంటే బయట పెట్టాలని సూచించారు. గురువారం రోహిణిలో బీజేపీ ఎన్నికల ర్యాలీ నిర్వహించింది.

ఈ ర్యాలీలో అమిత్‌ షా మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో ఓటమి ఖాయమని కేజ్రీవాల్‌కు అర్ధమైంది. అందుకే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే యమునా వాటర్‌లో విషం కలిపారని ఆరోపిస్తున్నారు. యమునా నదిలో విషం ఉందన్న ల్యాబ్ రిపోర్టును విడుదల చేయాలి.  

అబద్ధాల పుట్ట
ఎన్నికల్లో గెలవాలంటే అబద్ధాలు చెప్పడం మానేయమని కేజ్రీవాల్‌కు చెప్పాలనుకుంటున్నాను. ఢిల్లీ ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం యమునా నీళ్లలో విషం కలిపిందని అంటున్నారు. యమునాలో విషం కలిపితే  ఏ విషం కలిపారు? విషయం ఉన్నట్లు లేబొరేటరీలో గుర్తించారు. అంతేకాదు, ఆప్‌ ప్రభుత్వం మద్యం దుకాణాలను మూసివేస్తామని హామీ ఇచ్చిందని, బదులుగా  ఆలయాలు,స్కూల్‌ పరిసర ప్రాంతాల్లో తెరిచారు. కోట్ల విలువైన మద్యం కుంభకోణంలో జైలు పాలయ్యారు’ అని అమిత్‌ షా ఆరోపించారు.

తనను తాను నిజాయితీ పరుడినని చెప్పుకుని తిరిగే కేజ్రీవాల్‌ మద్యం కుంభకోణం, జల్ బోర్డులో రూ. 28400 కోట్ల కుంభకోణం, రేషన్ పంపిణీలో రూ. 5,400 కోట్ల కుంభకోణంలో ప్రమేయం ఉందన్నారు.  

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)