Breaking News

'అగ్నికి ఆజ్యం పోయెుద్దు..' అమిత్ షా ఫైర్..

Published on Wed, 08/09/2023 - 19:30

ఢిల్లీ: మణిపూర్ అంశంపై చర్చకు కేంద్రం ఎప్పుడైనా సిద్ధంగానే ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ఈ అంశంలో దాచడానికి ఏమీ లేదని అన్నారు. ఈ వ్యవహారంపై కేంద్రం మౌన వ్రతం పాటించడంలేదని చెప్పారు. మణిపూర్‌లో అల్లర్లు చెలరేగిన సమయంలో కేంద్ర సహాయ మంత్రి 23 రోజులు అక్కడే గడిపారని పేర్కొన్నారు. తాను కూడా స్వయంగా మూడు రోజులు పర్యటించి పరిస్థితుల్ని చక్కదిద్దినట్లు వెల్లడించారు. ఈ మేరకు లోక్‌సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రెండు గంటలపాటు మాట్లాడారు. 

సరికాదు..
ప్రస్తుతం అక్కడ ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయని అమిత్ షా చెప్పారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మణిపూర్ మహిళల వీడియోపై కూడా ఆయన మాట్లాడారు. ఈ ఘటన సిగ్గుచేటని కేంద్రం అంగీకరించిందని చెప్పారు. ఆ వీడియోను పోలీసులకు ఇవ్వాల్సిందని చెప్పారు. పార్లమెంట్ సమావేశాలకు ముందు రిలిజ్ చేయడం సరికాదని అన్నారు.

అగ్నికి ఆజ్యం
ప్రతిపక్షాలు చేసే చర్యలు అగ్నికి ఆజ్యం పోసే దిశగా ఉన్నాయని అమిత్‌ షా ఆరోపించారు. మణిపూర్ అంశంపై రాహుల్ గాంధీ రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. మణిపూర్ ఘటనలను కేంద్రం కూడా సమర్థించడం లేదని చెప్పారు. ప్రతిపక్షాలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు.  

శాంతి నెలకొంటోంది..
మణిపూర్ ఘటనపై అక్కడి సీఎంను మార్చాల్సిన పనిలేదని అమిత్ షా అన్నారు. బీరేన్ సింగ్ చక్కగా స్పందిస్తున్నారని.. మాట వినకపోతే తొలగిస్తారని చెప్పారు. ఈ ఘటనలో సరిగా వ్యవహరించని అధికారులను మార్చినట్లు చెప్పారు. మణిపూర్‌లో శాంతి పరిస్థితులు నెలకొనడానికి అన్ని ప్రయత్నాలను కేంద్రం చేస్తోందని అన్నారు.

మే3 నాడు అల్లర్లు ప్రారంభమయ్యాయని అమిత్ షా చెప్పారు. నేటికి అవి కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికీ 152 మరణించగా.. ఒక్క మే నెలలోనే 107 మంది మృతి చెందినట్లు లోక్‌సభలో పేర్కొన్నారు. రెండు తెగలు మైతీ, కుకీల మధ్య గొడవ ప్రారంభమైనట్లు చెప్పారు. రెండు వర్గాలతో చర్చలు సాగిస్తున్నట్లు వెల్లడించారు. కుకీ గ్రామాల్లో పుకార్లు వ్యాపించిన కారణంగానే ఘర్షణలు ప్రారంభమయ్యాయని అన్నారు. 

ఇదీ చదవండి: పేరు మార్చుకోనున్న కేరళ!
 

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)