Breaking News

బురద చల్లుతూనే ఉంటారు.. పట్టించుకోవద్దు: అంబటి రాయుడు

Published on Tue, 07/11/2023 - 13:32

సాక్షి, గుంటూరు: స్వచ్ఛందంగా సేవలందించే వలంటీర్లను జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సంఘ విద్రోహ శక్తులతో పోల్చటాన్ని ప్రముఖ క్రికెటర్‌ అంబటి  రాయుడు తప్పుబట్టారు. వలంటీర్లకు దురుద్దేశాలను ఆపాదించడంపై ఆయన స్పందిస్తూ..

‘‘వలంటరీ వ్యవస్థ గురించి ఎంత గొప్పగా చెప్పినా తక్కువే. మంచి పనులు చేసేటప్పుడు ఎవరో ఒకరు బురద చల్లుతూనే ఉంటారు. వాటిని మనం పట్టించుకోకూడదు. వలంటీర్లు అందరూ ధైర్యంతో ముందుకు వెళ్లాలి’’ అంటూ అంబటి రాయుడు పిలుపునిచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లో వలంటరీ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుందని అంబటి అన్నారు. వలంటరీ వ్యవస్థ మన రాష్ట్రానికి ఫ్లాగ్ షిప్‌. దేశంలో 70 సంవత్సరాల నుంచి జరగనది మన రాష్ట్రంలో వలంటరీ వ్యవస్థ ద్వారా జరుగుతోంది. ప్రతి మనిషికి ఏది అందాలో అది వలంటరీ ద్వారా అందుతుందన్నారు.
చదవండి: పవన్‌ అడ్డంగా దొరికిపోయాడు.. తన బట్టలు తానే ఊడదీసుకుని..

‘‘వలంటరీ వ్యవస్థ ఏర్పాటు ఒక గొప్ప ఆలోచన. వలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఎంతో మంచి జరుగుతుంది. ప్రజలకు మంచిగా సేవలందించే వలంటరీ వ్యవస్థ మన రాష్ట్రంలో తప్ప దేశంలో ఎక్కడా లేదు. కరోనా సమయంలో వలంటీర్లు తమ ప్రాణాన్ని ఫలంగా పెట్టి అందరికీ సేవలందించారు. జీవితాంతం ప్రతి ఒక్కరూ దాన్ని గుర్తుపెట్టుకోవాలి’’ అని అంబటి రాయుడు పేర్కొన్నారు.
చదవండి: పవన్‌ వ్యాఖ్యలపై వలంటీర్ల ఆగ్రహ జ్వాల

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)