Breaking News

కూటమి కుట్రకు పోలవరం ప్రాజెక్టు బలి: అంబటి విమర్శలు

Published on Fri, 11/01/2024 - 16:27

సాక్షి, గుంటూరు: ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదాను సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు అని వైఎస్సార్‌ సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం కుట్రకు పోలవరం ప్రాజెక్టు బలికాబోతుందన్నారు. చంద్రబాబు ఇలాంటి విషయాల్లో చాలా దిట్ట అని, ప్రభుత్వ కుట్రలతో ఈ ప్రాజెక్టు బ్యారేజీ స్థాయికి పడిపోయిందన్నారు.

పోలవరం ప్రాజెక్టుపై మంత్రి నిమ్మలరామానాయుడు అసలు కన్నా కొసరు ఎక్కువ మాట్లాడారని అంబటి మండిపడ్డారు. రెండు దశలు ఉండవంటూ నిమ్మల చేసిన వ్యాఖ్యలు వింటుంటే.. ఆయనకు పోలవరం ప్రాజెక్టుపై పూర్తి అవగాహన లేనట్టుందని విమర్శలు గుప్పించారు.  ప్రాజెక్టు ఏదైనా దశలవారీగా పూర్తిచేస్తారని తెలిపారు

ప్రాజెక్టు మొదటి దశలో 115.5 టీఎంసీల నిల్వకు పనికొస్తుందని.. చివరగా 194.6 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తేనే ప్రాజెక్టు పూర్తి ఫలితాలు అందుతాయని వివరించారు. అయితే 41.15 అడుగుల ఎత్తుకే నిర్మించడానికి కూటమీ ప్రభుత్వం సిద్ధమైందని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏం జరిగినా.. తప్పు వైఎస్సార్‌సీపీపై నెట్టివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చదవండి: బాబూ.. అమరావతికి ఔటర్‌ రింగ్‌ రోడ్డు అవసరమా?: వడ్డే శోభనాద్రీశ్వరరావు

‘చంద్రబాబు తప్పిదాలు చేస్తే వైఎస్‌జగన్‌ వచ్చాక వాటిని సరిచేశారు. బాబు తప్పిదాల వల్లే ప్రాజెక్టు సరైన సమయంలో పూర్తికాలేదు. పోలవరం ప్రాజెక్టుపై వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు తెలియాలి. చంద్రబాబు వచ్చాక పోలవరం ప్రాజెక్టుకు తీవ్రమైన విఘాతం ఏర్పడింది. ప్రాజెక్టుకు ఆయన ఉరి వేస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై చంద్రబాబు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. 

ఈ ప్రాజెక్టును ఆనాడు వైఎస్సార్‌ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. బాబు స్వార్థం వల్ల ప్రాజెక్టు కుంటుపడింది. నేను చెప్పిన ప్రతి అంశం సత్య శోధనకు నిలబడింది. డయాఫ్రం వాల్‌ నిర్మాణం చంద్రబాబు చేసిన తప్పిదమే. కూటమి ప్రభుత్వం పోలవరానికి అన్యాయం చేస్తోంది. ప్రాజెక్టును పూర్తిచేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వమే లాలూచీ పడింది. ఇంత ఘోరం జరుగుతుంటే గొంతెత్తి మాట్లాడాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా వైఎస్సార్‌సీపీపై ఉంది. రాష్ట్ర ప్రజలు దీనిపై ఆలోచించాల్సిన అవసరం ఉంది.

పోలవరం సెకండ్‌ ఫేజ్‌ను నాశనం చేయడానికి చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. డబ్బు కాజేయాలనే దురుద్దేశంతోనే ప్రాజెక్టును మీరు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను ఏం చేశారు? పోలవరం కోసం ఇచ్చిన డబ్బునుడైవర్ట్‌ చేశారు.  ఆ నింద వైఎస్సార్‌సీపీపై వేసే ప్రయత్నం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న పని వల్ల జీవనాడికి తీవ్ర అన్యాయం. పోలవరంపై జరుగుతున్న కుట్రలపై ప్రజలను చైతన్యవంతం చేస్తాం. ఇప్పటికైనా చేసిన తప్పులను చంద్రబాబు సరిచేసుకోవాలి. తెలుగుజాతికి ద్రోహం చేయొద్దు.’ అని అంబటి పేర్కొన్నారు.

YSRCP అంబటి రాంబాబు ప్రెస్ మీట్

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)