Breaking News

‘నేనేమైనా ఉర్ధు మాట్లాడుతున్నానా?’ విద్యార్థిపై కర్ణాటక మంత్రి ఆగ్రహం

Published on Thu, 11/21/2024 - 11:34

బెంగళూరు: కర్ణాటక విద్యాశాఖమంత్రి మధు బంగారప్ప తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. మంత్రికి కన్నడ రాదని ఓ విద్యార్ధి వ్యాఖ్యానించడంతో ఆయన సీరియస్‌ అయ్యారు. విద్యార్ధి మాటలను మూర్ఖత్వంగా పేర్కొంటూ.. అతడిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాడు.. అసలేం జరిగిందంటే

కర్ణాటక కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌, జేఈఈ, నీట్‌ వంటి ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న ఔత్సాహిక విద్యార్ధులకు ఉచిత ఆన్‌లైన్‌ కోచింగ్‌ అందించే ప్రభుత్వ కార్యక్రమాన్ని మంత్రి బుధవారం ప్రారంభించారు. ఇందులో సుమారు 25,000 మంది విద్యార్థులకు ఈ ఉచిత ఆన్‌లైన్‌ కోచింగ్‌ అందించనున్నారు. 

ఈ సందర్భంగా మంత్రి మధు.. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విద్యార్ధులతో ఇంటరాక్ట్‌ అయ్యారు. ఈ క్రమంలో ఓ విద్యార్థి మాట్లాడుతూ.. విద్యామంత్రికి కన్నడ రాదు అని అన్నారు. దీనిపై మంత్రి వెంటనే స్పందిస్తూ.. ‘ఏంటి నేను ఏమైనా ఉర్ధూలో మాట్లాడుతున్నానా? టీవీ ఆన్ చేసి చూడు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అనంతరం సదరు విద్యార్థిపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

 ఇక మంత్రి ప్రవర్తనపై ప్రతిపక్ష బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు కర్నాటక బీజేపీ అధికారిక ఎక్స్‌లో మంత్రిని ఓ విద్యార్థి ప్రశ్న అడిగే కార్టూన్‌ను పోస్ట్ చేసింది. మంత్రి విద్యార్థులను బోల్డ్‌ ప్రశ్నలు అడగమని చెబుతున్న ఫోటోకు ‘ప్రశ్నించేవారిని తెలివితక్కువవాడిగా పిలుస్తుంది మీరే’ అని సూచించే  క్యాప్షన్‌ను పేర్కొంది. 

 కర్నాటకకు చెందిన కేంద్ర మంత్రి, ఎంపీ ప్రహ్లాద్ జోషి ఎక్స్‌లో స్పందిస్తూ.. మధు బంగారప్ప తనకు కన్నడ రాదని బహిరంగంగా ఒప్పుకోలేదా? ఈ విషయాన్ని గుర్తు చేసిన విద్యార్థిని కర్ణాటక కాంగ్రెస్‌ ఎందుకు శిక్షిస్తోంది? వారు ఇక్కడ ఏం సాధించాలని ప్రయత్నిస్తున్నారు ? ఆశలేని కాంగ్రెస్ నుంచి ఇంకా ఏమి ఆశించవచ్చని  ప్రశ్నించారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)