Breaking News

Allu Arjun Issue:‘సూపర్‌స్టార్‌లా ఫీలైపోతున్న రేవంత్‌’

Published on Tue, 12/24/2024 - 20:21

సంధ్యా థియేటర్‌ తొక్కిసలాట ఘటన.. నటుడు అల్లు అర్జున్‌ విషయంలో తెలంగాణ పోలీసులు(Telangana Police) వ్యవహరిస్తున్న తీరును రాజకీయ వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అనుమతి లేకుండా ర్యాలీగా రావడం ముమ్మాటికీ తప్పేనని..  చట్టం తన పని తాను చేసుకుపోతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం మరింత దుమారాన్ని రేపింది. అయితే.. 

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అల్లు అర్జున్‌ను ఇబ్బంది పెడుతోందని ఇటు బీఆర్‌ఎస్‌, అటు బీజేపీలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో మరో గొంతుక ఇప్పుడు రేవంత్‌కు వ్యతిరేకంగా వినిపించింది. అల్లు అర్జున్‌ వ్యవహారంలో  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(Revanth Reddy) తనను తాను ఓ సూపర్‌స్టార్‌లా ఫీలవుతున్నారని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై మండిపడ్డారు. 

‘‘తెలంగాణలో ఎవరు సూపర్‌ స్టార్‌ అనే విషయంలో ఆయన(రేవంత్‌ రెడ్డి ) పోటీ పడుతున్నారనుకుంటా. అల్లు అర్జున్‌ కంటే తానే సూపర్‌స్టార్‌నని ఆయన చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.  ప్రస్తుతం ఆయన కాంగ్రెస్‌ పార్టీలో నటిస్తున్నారు. తెలంగాణలో ఆయనే ఇప్పుడు మెయిన్‌ యాక్టర్‌. అల్లు అర్జున్‌ నివాసంపై రాళ్లు విసిరి రచ్చ చేసిన వాళ్లలో  ఇద్దరు ముగ్గురు ఆయన (రేవంత్‌ రెడ్డి ) నియోజకవర్గానికి చెందిన వాళ్లే.  ఇది రాజకీయ దురుద్దేశంతో జరిగిన దాడేనని స్పష్టం అవుతోంది. 

.. అలాంటి ఘటన జరగకుండా ఉండాల్సింది. ఒక నిండుప్రాణం పోవాలని అల్లు అర్జున్‌ (Allu Arjun) కూడా అనుకోరు కదా. ఒకరిని బలిపశువు చేయడం, వేధించడం ముమ్మాటికీ తప్పే’’ అని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నామలై అన్నారు. 

 ఇదీ చదవండి: అల్లు అర్జున్‌ను ఆనాడు అడ్డుకుని ఉంటే.. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)