Breaking News

కూటమికి గుచ్చుకున్న గాజు గ్లాసు!

Published on Mon, 04/29/2024 - 18:55

సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో కూటమికి మరో తల నొప్పి మొదలైంది. టీడీపీ, జనసేన పార్టీ రెబల్స్‌ ఇస్తున్న షాక్‌కు కూటమికి గాజు గ్లాసు గుచ్చుకుంటోంది. గాజు గ్లాసుతో టీడీపీ, జనసేన రెబల్స్‌ పోటీలోకి దిగుతున్నారు. తాజాగా గాజు గ్లాస్‌ను ఫ్రీ సింబల్‌గా వాడుకోవచ్చని ఈసీ వర్గాలు తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈసీపై.. టీడీపీ, బీజేపీ పార్టీల ఒత్తిడి ఫలించదు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు వ్యవహరించింది.

దీంతో  21 అసెంబ్లీ చోట్ల జనసేన అభ్యర్థులు గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేస్తుండగా.. ఈసీ ప్రకటనతో మిగిలిన చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ కేటాయించే అవకాశం ఉంది. కాగా, టీడీపీ, జనసేన రెబల్స్‌.. గాజు గ్లాస్ గుర్తుతోనే కూటమికి ధమ్కీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. విజయనగరం టీడీపీ రెబల్ మీసాల గీతకు, జగ్గంపేట జనసేన రెబల్ సూర్యచంద్రకు ఈసీ గాజు గ్లాస్ కేటాయించింది. ఇక.. ఎస్‌ కోటలో జనసేన రెబల్ కొట్యాడ లోకాభిరామకోటి గాజు గ్లాస్‌తో పోటీకి దిగుతున్నారు. 

మరోవైపు.. టీడీపీకి పలు నియోజకవర్గాల్లో రెబెల్స్ బెడద తప్పటం లేదు. విజయనగరం, ఉండి, పోలవరం, పెనుగొండ, హిందూపురంలో బరిలో రెబల్ అభ్యర్థులు పోటీకి దిగుతున్నారు. సినీనటుడు బాలకృష్ణపై పరిపూర్ణానంద స్వామి, పరిటాల సునీతపై ప్రొఫెసర్ రాజేష్, అదితి గజపతిపై మీసాల గీత , జ్యోతుల నెహ్రూపై సూర్యచంద్ర,  రఘురామకృష్ణంరాజుపై ఉండిలో మాజీ ఎమ్మెల్యే శివ రామరాజు, పోలవరంలో టీడీపీ రెబల్ మొడియం సూర్యచంద్రరావు బరిలో నిలుస్తున్నారు. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)