Breaking News

అందరికీ రుణమాఫీ కోసం 23న రైతుదీక్ష

Published on Mon, 08/19/2024 - 04:15

నిర్మల్‌: రాష్ట్ర ప్రభు త్వం అర్హులైన రైతు లందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. అలా చేయనిపక్షంలో ఈనెల 23న రైతులతో భారీ రైతుదీక్ష చేపడతామని ప్రకటించారు. ఆదివారం నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసాకు ఇవ్వాల్సిన నిధులనే రుణమాఫీకి మళ్లించిందని.. ఇప్పటి కే రెండు పంటలకు రైతు భరోసా సాయం ఇవ్వకుండా ఎగ్గొట్టారని ఆరోపించారు.

రాష్ట్రంలో 60 లక్షల మంది అర్హులైన రైతులు ఉండగా.. కేవలం 22 లక్షల మందికే రుణమాఫీ చేయడమేంటని ప్రశ్నించారు. రూ.49 వేల కోట్ల రుణాలకుగాను.. రూ.17 వేల కోట్లే ఇ చ్చారని మండిపడ్డారు. రుణమాఫీ కాని రైతు లను మళ్లీ మోసం చేసేందుకే.. మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే లకు దమ్ముంటే.. గ్రామాలకు వెళ్లి పూర్తిస్థాయి లో రైతులకు రుణాలు మాఫీ అయ్యాయో లేదో ఆరా తీయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న రైతుల రుణాలను త్వరలో మాఫీ చేయాలని.. రైతుభరోసా ఖరీఫ్‌ సీజన్‌ డబ్బులను ఈ నెలా ఖరులోగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)