Breaking News

కేంద్రం తెలంగాణకు అన్యాయం చేయలేదు: బీజేపీ

Published on Wed, 07/24/2024 - 16:04

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రం సాకుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు పక్కదారి పట్టిస్తుందన్నారు బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. కేంద్రం తెలంగాణకు అన్యాయం చేయలేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణ పరిశ్రమలు ఏపీకి తరలి వెళ్ళేవని అన్నారు. కేంద్రం చేసిన పనికి తెలంగాణ కేంద్రానికి పాలాభిషేకం చేయాలని చెప్పారు.

విభజన చట్టం హామీల్లో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ లేదన్నారు మహేశ్వర్‌ రెడ్డి. అవకాశం ఉంటేనే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పరిశీలన చేస్తానని విభజన చట్టంలో ఉందన్నారు. ఫీజిబిలిటీ లేదని అధికారులు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో చెప్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 28 వేల కోట్ల ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

‘మొదటినుంచి తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ మెయిన్ విలన్. ఆనాడు తెలంగాణను ఆంధ్రావాలతో విలీనం చేసింది నెహ్రూ. మళ్లీ కాంగ్రెస్ పార్టీని ఆంధ్ర వాళ్ళతో తెలంగాణను విడదీసింది. విభజన చట్టంలో సరైన అంశాలను చేర్చలేదు అందుకే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. ఉద్యమంలో వేలమంది అమరులు అయ్యారు. ఉద్యమాన్ని తట్టుకోలేక తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. కేంద్రం అన్యాయం చేసింది అని కాంగ్రెస్ భావిస్తే 8 మంది ఎంపీలు రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలి.

బీఆర్ఎస్ కాళేశ్వరం లక్ష కోట్లతో కట్టి కమిషన్లు తీసుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ మూసి నది లక్ష కోట్లతో అభివృద్ధి చేస్తానంటుంది. ఎవరికోసం ఎవరికీ కమిషన్లు ఇవ్వడానికి తీసుకోవడానికి లక్ష కోట్లతో మూసీ నది అభివృద్ధి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కుట్రలో బీజేపీని భాగస్వామ్యం రమ్మంటున్నారు’ అని మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ ఎంపీల రాజీనామా సవాళ్లకు కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ముందు బీజేపీకి చెందిన 8 మందినెంపీలు రాజీనామా చేసి తమ దగ్గరికి రావాలని సవాల్‌ విసిరారు. బీజేపీ ఎంపీలు రాజీనామా చేసి తెలంగాణ కోసం పోరాడాలని తెలిపారు.బీజేపీ వారు తెలంగాణ కోసం ఫైట్ చేయాల్సింది పోయి కాంగ్రెస్ ఎంపీలను రాజీనామా చేయమనడం విడ్డూరంగా ఉందన్నారు

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)