Breaking News

బీజేపీని ఓడించగలిగితే కాంగ్రెస్‌తో సర్దుబాటు

Published on Thu, 04/20/2023 - 03:43

సాక్షి, హైదరాబాద్‌: కొన్ని రాష్ట్రాల్లో ఉన్నట్టుగా బీజేపీని ఓడించే స్థాయికి కాంగ్రెస్‌ చేరితే ఇక్కడ కూడా ఆ పార్టీతో సర్దుబాటు చేసుకుంటామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. కానీ రాష్ట్రంలో పరిస్థితి ఆవిధంగా లేదని, అందుకే బీఆర్‌ఎస్‌ వైపే ఉంటామని చెప్పారు.

అయితే సీట్ల గురించి బీఆర్‌ఎస్‌తో ఇంకా చర్చ జరగలేదని, సమయం వచ్చిన ప్పుడు తమ బలానికి తగ్గట్టుగా సీట్లు కోరతామని అన్నారు. తాము కోరుకున్నట్టుగా బీఆర్‌ఎస్‌ సీట్లు ఇవ్వకపోతే విడిగానే పోటీ చేస్తామని తెలిపారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాల సందర్భంగా బుధవారం ఎంబీ భవన్‌లో పొలిట్‌బ్యూరో సభ్యులు ఎ.విజయరాఘవన్, బీవీ రాఘవులు, నాయకులు చెరుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డిలతో కలిసి తమ్మినేని విలేకరులతో మాట్లాడారు.

స్నేహంగా ఉంటాం..సమస్యలపై పోరాడతాం
బీజేపీని వ్యతిరేకిస్తున్న బీఆర్‌ఎస్‌తో రాజకీయంగా స్నేహంగా ఉంటామని తమ్మినేని వీరభద్రం చెప్పారు. అదే సమయంలో ఇచ్చిన హామీల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామన్నారు. బీఆర్‌ఎస్‌ తప్పులను విమర్శిస్తామని, ఒప్పును సమర్థిస్తామని చెప్పారు. బీజేపీని ఎదుర్కోవడం అంత సులువు కాదని, అందుకే కేసీఆర్‌ను సమర్థిస్తున్నామని వివరించారు. బీజేపీ వ్యతిరేక పోరాటాన్ని బలపర్చేందుకే బీఆర్‌ఎస్‌తో సానుకూలంగా ఉన్నామని, బీజేపీని ఎదుర్కోవడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

అఖిలపక్షం పేరుతో కొన్ని రాజకీయ పార్టీలు చేసే ఆందోళనల్లో తాము పాల్గొనబోమని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దెదించాలని తాము కోరుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలన్నింటినీ క్రోడీకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, వారంలో సీఎం కేసీఆర్‌తో భేటీ అవుతామని తమ్మినేని చెప్పారు. జూన్‌లో సంతకాల సేకరణ, ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి, నిరసనలు చేపడతామన్నారు. ప్రజాసంఘాల పోరాట కమిటీ ఉద్యమ కార్యాచరణకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని, తాము కూడా అందులో పాల్గొంటామని తెలిపారు. 

బీజేపీ ఎజెండా ప్రమాదకరం: విజయరాఘవన్, బీవీ రాఘవులు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్పొరేట్, మతతత్వ ఎజెండా దేశానికే ప్రమాదకరమని విజయరాఘవన్, రాఘవులు విమర్శించారు. అదానీ అక్రమాలపై హిండెన్‌బర్గ్‌ నివేదిక ఇచ్చినా దానిపై పార్లమెంటులో చర్చ జరగలేదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజాస్వామిక హక్కులు కాలరాస్తున్నారని, పోలీసు రాజ్యం నడుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా సామాన్యులను సమీకరించి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. 

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)