Breaking News

Jharkhand: ఇలా గెలిచి.. అలా రాజీనామాకు సిద్ధమై.. ఏజేఎస్‌యూలో విచిత్ర పరిణామం

Published on Mon, 11/25/2024 - 07:11

రాంచీ: జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మహారాష్ట్రలో మహాయుతి కూటమి విజయం సాధించింది. జార్ఖండ్‌లో  ఇండియా కూటమి విజయం సాధించింది. జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్‌కు చెందిన జేఎంఎం (జేఎంఎం) 34 సీట్లు గెలుచుకుంది. ఇంతలో ఒక విచిత్ర పరిణామం చోటుచేసుకుంది.

ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్‌యూ)పార్టీ నుంచి కొత్తగా ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే నిర్మల్ మహతో  ఇంతలోనే రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ చీఫ్‌ సుదేష్ మహతోను అసెంబ్లీకి పంపేందుకు తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నానని ప్రకటించారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో సిల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఏజేఎస్‌యూ  పార్టీ అధినేత సుదేష్ మహతో ఓటమి పాలయ్యారు.

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మిత్రపక్షమైన ఏజేఎస్‌యూ పార్టీ జార్ఖండ్‌లోని 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. అయితే కేవలం ఒక సీటును మాత్రమే గెలుచుకోగలిగింది. అది కూడా కేవలం 231 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో ఈ విజయం సాధించింది. ఈ ఒక్క సీటు నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే నిర్మల్ మహతో  కూడా ఇప్పుడు రాజీనామాకు సిద్ధమయ్యారు. మండూ స్థానం నుంచి ఎన్నికైన ఈయన మీడియాతో మాట్లాడుతూ తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు పార్టీ చీఫ్‌ సుదేష్ మహతోకు లేఖ పంపానని అన్నారు.

తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా ఆయనను అభ్యర్థించానన్నారు. తద్వారా సుదేష్ మహతో ఇక్కడ(మండూ) జరగబోయే ఉప ఎన్నికల్లో పోటీ చేసి అసెంబ్లీకి  వెళ్లే అవకాశం ఉంటుందని అన్నారు. సుదేష్ మహతో జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అభ్యర్థి అమిత్ కుమార్‌ చేతిలో ఓటమి పాలయ్యారు.  ఇతనితో పాటు ఏజేఎస్‌యూకి చెందిన మరో 8 మంది అభ్యర్థులు కూడా ఓడిపోయారు. ఈ పార్టీ కేవలం మండూ సీటును మాత్రమే గెలుచుకుంది.

ఇది  కూడా చదవండి: మహారాష్ట్ర ఫలితాల ఎఫెక్ట్‌.. మార్కెట్లు పుంజుకునే చాన్స్‌ 

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)