Breaking News

Ajit Pawar: ఎన్సీపీలో చీలిక.. బీజేపీ వ్యతిరేక కూటమి యత్నాలకు దెబ్బ! 

Published on Mon, 07/03/2023 - 07:59

న్యూఢిల్లీ: ఎన్సీపీలో అనూహ్య చీలిక మహారాష్ట్రలోనేకాదు జాతీయ స్థాయిలో ప్రకంపనలు కలిగిస్తోంది. ఎక్కువ మంది ఎమ్మెల్యేలను అజిత్‌ తనవెంట తీసుకెళ్లడంతో శరద్‌ పవర్‌కు సొంత పార్టీలో బలం తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో విపక్షాల ఐక్యతకు తనవంతు బలం ఇచ్చే స్థాయిలో శరద్‌ ప్రస్తుతం లేరనే చెప్పాలి. దీంతో గత నెలలో పట్నాలో 15 ప్రతిపక్ష పార్థీలల ఐక్యత కోసం చేసిన యత్నానికి జోరు కాస్తంత తగ్గింది.

ఇప్పటికే ఢిల్లీ రాష్ట్రంలో పాలనపై సర్వాధికారం విషయంలో ఆర్డినెన్స్‌కు సంబంధించి ఆప్, కాంగ్రెస్‌ మధ్య పొసగలేదు. అటు పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్, కాంగ్రెస్‌ మధ్య బాహాటంగా మాటల తూటాలు పేలాయి. కేరళలోనూ కాంగ్రెస్, సీపీఎంలకూ కుదరట్లేదు. తాజాగా అజిత్‌ ఇచ్చిన షాక్‌తో 2024 ఎన్నికల్లో బీజేపీ మోదీ ప్రభుత్వాన్ని ఐక్యంగా ఢీకొట్టాలన్న ప్రయత్నాలకు కాస్తంత బ్రేక్‌ పడినట్లయింది.  విపక్షాలను ఏకం చేయడంలో ఇప్పటి వరకు కీలకంగా ఉన్న శరద్‌ పవార్‌ మున్ముందు ఎలా స్పందిస్తారనే దానిపై ఆధారపడి ఉంది. 

మహారాష్ట్రలో బీజేపీకి ఊపు 
మహారాష్ట్ర రాజకీయాల్లో కొద్దికాలంగా బీజేపీకి పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. షిండే ప్రభుత్వంలో చేరాలన్న అజిత్‌ నిర్ణయంతో ఆ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రంలో బీజేపీ మళ్లీ కీలకంగా మారే సమయం వచ్చింది. లోక్‌సభ ఎన్నికల సమయానికి తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వంలోని మూడు పార్టీలు మూడు శక్తివంతమైన వర్గాలకు నాయకత్వం సాధించే స్థాయిలో ఉన్నాయి. మహావికాస్‌ అఘాడి(ఎంవీఏ)పై బీజేపీ పైచేయి సాధించేందుకు అవకాశం చిక్కింది.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)