Breaking News

శ‌ర‌ద్ ప‌వార్‌కు ధ‌న్య‌వాదాలు: అజిత్ ప‌వార్‌

Published on Tue, 06/11/2024 - 10:08

ముంబై: ఎన్సీపీ నేత, మహారాష్ట్ర డప్యూటీ సీఎం అజిత్​ పవార్​.. తన అంకుల్‌ శరద్​ ప‌వార్‌కు ధన్యవాదాలు తెలిపారు. సోమ‌వారం ఎన్సీపీ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వం సంద‌ర్భంగా  పార్టీని.. 24ఏళ్ల పాటు సుధీర్ఘంగా న‌డిపించిన శ‌ర‌ద్ ప‌వార్‌కు అజిత్ ప‌వార్ ధ‌న్య‌వాదాలు తెలిపారు.

1999లో ఎన్సీపీ ఆవిర్భావించింది. ఈ ఏడాదితో 24 ఏళ్లు పూర్తి చేసుకుంది.  మేర‌కు సోమ‌వారం ముంబైలో అజిత్ కుమార్ మాట్లాడుతూ..  గత 24 సంవత్సరాలుగా పార్టీని నడిపించినందుకు శరద్ పవార్‌కు ధన్యవాదాలు తెలిపారు. వారితోపాటు పార్టీని స్థాపించినప్పటి నుంచి కొన‌సాగుతున్న వారంద‌రికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాన‌ని చెప్పారు.

శివాజీ మహారాజ్, షాహూ మహారాజ్, మహాత్మా ఫూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ బోధనలపైనే మా సిద్ధాంతాలు ఆధారపడి ఉన్నాయని నేను అందరికీ హామీ ఇస్తున్నాన‌ని పేర్కొన్నారు.

రాయ్‌గఢ్ లోక్‌సభ స్థానాన్ని గెలుచుకోవడం ద్వారా పార్టీ నాయకుడు సునీల్ తట్కరే ఎన్సీపీ ప్రతిష్టను కాపాడారని ఆయన పేర్కొన్నారు. ఎన్సీపీలో అంతర్గత సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని  అన్నారు.

అదే విధంగా  ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ 3.0 ప్ర‌భుత్వంలో కేబినెట్ బెర్త్ కంటే త‌క్కువ స్థాయిలో ఏ ప‌ద‌విలో ఉండ‌కూడ‌ద‌ని ఎన్సీపీ నిర్ణ‌యించుకున్న‌ట్లు పేర్కొన్నారు. `కేబినెట్ పోర్ట్‌ఫోలియో కంటే తక్కువ పదవిని మేము అంగీకరించబోమని బీజేపీకి స్పష్టం చేస్తున్నాం. వారు చాలా మంది సభ్యులకు కేబినెట్ పదవులు ఇవ్వాలని మాతో చెప్పారు. మేము ఇప్పటికీ ఎన్డీయేలో భాగమే` అని ఆయన అన్నారు.  స్తుతం 284  సీట్లు ఉన్న ఎన్డీయ బ‌లం రాబోయే నెలల్లో 300 మార్కును దాటుతుందని పేర్కొన్నారు.

కాగా ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నాలుగు చోట్ల పోటీ చేయ‌గా.. కేవ‌లం ఒక స్థానాన్ని మాత్ర‌మే గెలుచుకుంది.  మ‌రోవైపు శ‌ర‌ద్ ప‌వార్ నేతృత్వంలోని  ఎన్సీపీ పోటీ చేసిన పది నియోజకవర్గాలలో ఎనిమిదింటిని గెలుచుకుంది. ముఖ్యంగా, అజిత్ భార్య సునేత్రా పవార్.. సిట్టింగ్ ఎంపీ సుప్రియా సూలే చేతిలో బారామతిలో ఓడిపోయారు.

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)