Breaking News

ఆర్థిక శాఖ.. ఫడ్నవీస్‌ చేతి నుంచి అజిత్‌ పవార్‌కు

Published on Fri, 07/14/2023 - 18:40

ముంబై:  మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ నుంచి ఆర్థిక శాఖ.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) రెబల్‌ నేత, అజిత్‌ పవార్‌ చేతికి వెళ్లింది. మహారాష్ట్ర మంత్రివర్గంలో జూలై 2న చేరిన (ఎన్నీపీ) ఎమ్మెల్యేలకు శుక్రవారం నాడు శాఖల కేటాయింపు జరిగింది. ఎన్సీపీ రెబల్‌ నేత అజిత్‌ పవార్‌ కీలకమైన ఆర్థిక శాఖను సొంతం చేసుకున్నారు.  డిప్యూటీ సీఎంతో పాటు ఇప్పటివరకూ ఆర్థికశాఖ బాధ్యతలు కూడా ఫడ్నవీస్‌ వద్దనే ఉంది. అయితే ఆర్థికశాఖపై కన్నేసిన అజిత్‌ పవార్‌ పంతం పట్టీ మరీ ఈ శాఖను దక్కించుకున్నారు. ఈ బాధ్యతల్ని వెంటనే ఆయన స్వీకరించారు. 

బీజేపీ ఎత్తులను ముందుగానే అంచనా వేసిన అజిత్‌ పవార్‌..  తన వర్గానికి మంత్రివర్గంలో సుమచిత స్థానం కోసం జరిపిన లాబీయింగ్‌లో గ్రాండ్‌ సక్సెస్‌ అయ్యారు. కీలక శాఖలు రెండింటిని ఆయన వర్గమే దక్కించుకున్నారు.

తాజాగా శాఖల కేటాయింపుల్లో, ఎన్‌సీపీ సీనియర్ నేత ఛగన్ భుజ్‌బల్‌కు ఆహార, పౌర సరఫరాల శాఖ అప్పగించారు. అనిల్ పటేల్‌కు రిలీఫ్ అండ్ రిహాబిలేషన్, డిజాస్టర్ మేనేజిమెంట్ శాఖ కేటాయించారు. అదితి సునీల్ టట్కరేకు మహిళ, శిశు అభివృద్ధి శాఖ కేటాయించగా, ధనంజయ్ ముడేకు వ్యవసాయం, దిలీప్ వాల్సే పాటిల్‌కు రెవెన్యూ, పశుసంవర్ధక, పాడి అభివృద్ధి శాఖ కేటాయించారు.

ముఖ్యమైన పోర్ట్‌పోలియోలు దక్కించుకోవడంలో సీఎం ఏక్‌నాథ్‌ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో ఎన్సీపీ రెబల్‌ వర్గం జరిపిన చర్చలు ఫలవంతంగా ముగిశాయి. అదే సమయంలో ఎన్సీపీ(రెబల్‌)కి మంత్రి వర్గంలో ప్రాధాన్యత ఇవ్వాలనుకోవడంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న బీజేపీ-షిండే వర్గ ఎమ్మెల్యేలను ఆయా అధిష్టానాలు బుజ్జగించాయి.

చదవండి:  సుఖేష్‌ సంచలన ఆరోపణలపై కేటీఆర్‌ రియాక్షన్‌.. వాడెవడో కూడా తెలీదంటూ..

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)