Breaking News

ట్రిపుల్ ఇంజిన్ సర్కార్‌లో ట్రబుల్ షురూ: సుప్రియా సూలే

Published on Wed, 10/04/2023 - 19:55

ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇద్దరే ఢిల్లీ పర్యటనకు వెళ్లడం అంతకుముందు జరిగిన కేబినెట్ సమావేశాలకు అజిత్ పవార్ గైర్హాజరవడంతో ప్రతిపక్షాలు ట్రిపుల్ ఇంజిన్ సర్కారుపై విమర్శనాస్త్రాలు సాధించాయి. 

బుధవారం జరిగిన కేబినెట్ సమావేశానికి ఎన్సీపీ రెబెల్ అజిత్ పవార్ హాజరు కాకపోగా ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఢిల్లీ పర్యటనలో కూడా ఆయన కనిపించకపోవడంతో ప్రతిపక్షాలు ట్రిపుల్ ఇంజిన్ సర్కారుకు ట్రబుల్ మొదలైందని చెబుతున్నాయి. ఎన్సీపీ రెబెల్ మంత్రులకి జిల్లా సహాయక మంత్రులుగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో అజిత్ పవార్ మరోసారి అలకపాన్పు ఎక్కినట్టు తెలుస్తోంది. బీజేపీకి చెందిన చంద్రకాంత్ పాటిల్‌కు పూణే జిల్లా సహాయక మంత్రిగాను దిలీప్ వాల్సే పాటిల్‌కు బుల్దానా జిల్లా, హాసన్ ముష్రిఫ్‌కు కొల్హాపూర్ జిల్లా, ధనుంజయ్ ముండేను బీడ్ జిల్లాకు సహాయక మంత్రులుగా ప్రకటించింది షిండే ప్రభుత్వం.  

తనవారికి మంత్రి పదవులు దక్కనందునే అజిత్ పవార్ బీజేపీ-శివసేన ప్రభుత్వ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నరని  అంటున్నారు ప్రతిపక్ష నాయకులు విజయ్ వాడెట్టివార్. ఇదిలా ఉండగా ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే మాత్రం అజిత్ పవార్ వర్గంపై ఘాటు విమర్శలు చేశారు. ట్రిపుల్ ఇంజిన్ సర్కారు ఏర్పడి మూడు నెలలైనా కాలేదు అప్పుడే ట్రబుల్ మొదలయిందన్నారు.నిరాశలో ఉన్న వర్గం ఉపముఖ్యమంత్రి ఫడ్నవీస్ కు తమ అసంతృప్తిని తెలిపినట్టు సమాచారం అందింది.  హనీమూన్‌కు వెళ్లి మూడు నెలలైనా కాలేదు అప్పుడే ప్రభుత్వంలో ముసలం మొదలైందని వార్త్లు వస్తున్నాయి. అసలు ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తున్నారని ప్రశ్నించారు. 

ఎన్సీపీ తిరుగువర్గంలో మరో ఎమ్మెల్యే ఛగన్ భుజ్‌బల్ మాత్రం అజిత్ పవార్ గొంతు ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారని కేబినెట్ సమావేశాలకు ఎలా హాజరవుతారని, ఢిల్లీ పర్యటనకు ఎలా వెళతారని ప్రశ్నిస్తూనే రాజకీయంగా మాకు ఎటువంటి సమస్యలు లేవని తెలిపారు. 

ఇది కూడా చదవండి: కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)