Breaking News

కర్ణాటక సీఎం అభ్యర్థిపై ఖర్గే క్లారిటీ

Published on Sat, 05/13/2023 - 15:24

బెంగళూరు: కాంగ్రెస్ నాయకుల సమష్టి కృషి వల్లే కర్ణాటక ఎన్నికల్లో ఘన విజయం సాధించగలిగామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. భారీ మెజార్టీ అందించిన కన్నడ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రి ఎంపికపై నెలకొన్న ఉత్కంఠపైనా మీడియా ఆయన్ని ఆరా తీసింది. ఎవరిని ఎంపిక చేస్తారని ప్రశ్నించింది. అతిముఖ్యమైన ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియను అధిష్టానమే నిర్ణయిస్తుందని ఖర్గే స్పష్టం చేశారు. ‘‘కర్ణాటక ఎన్నికల్లో ప్రజాస్వామ్యానిదే విజయం. అధికారం డబ్బు, ప్రభావం పని చేయలేదు. బీజేపీ దృష్టంతా కర్ణాటక మీదే పెట్టింద’’ని అన్నారాయన.

అలాగే.. కర్ణాటకలో ప్రచారం చేసిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు ధన్యవాదాలు తెలిపారు. సోనియా గాంధీకి ఆరోగ్యం బాగాలేకపోయినా పార్టీ కోసం వచ్చి ప్రచారం చేశారని గుర్తు చేశారు. మేం గెలిచాం. ఇప్పుడు చేయాల్సిన పనులపై దృష్టి పెడతాం. ఎవర్నీ కించపరచాలని అనుకోవడం లేదు.  ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతాం. అన్ని హామీలు నెరవేర్చుతాం. అని ఖర్గే అన్నారు.

ఇదిలా ఉంటే రేపు బెంగళూరులో సీఎల్పీ సమావేశం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలోనే సీఎం ఎంపికపై ఓ స్పష్టత రావొచ్చని సమాచారం.  


చదవండి: కాంగ్రెస్‌ విజయానికి కారణమైన 6 మంత్రాలివే..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)