Breaking News

నేడు ఆల్‌పార్టీ మీటింగ్‌

Published on Wed, 07/19/2023 - 08:37

సాక్షి, ఢిల్లీ: రేపటి నుంచి(జులై 20 నుంచి..) పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాన్ను నేపథ్యంలో.. అఖిలపక్ష భేటీ నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు ఇవాళ అన్ని పార్టీల ప్రతినిధులతో కేంద్రం సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.

పార్లమెంట్‌ సమావేశాలకు ముందు కేబినెట్‌ సీనియర్‌ మంత్రులు.. సభావ్యవహారాలు సజావుగా సాగేందుకు సహకరించాలని అన్ని పార్టీలను కోరడం ఆనవాయితీ. చాలాసార్లు ఈ భేటీకి ప్రధాని సైతం హాజరవుతుంటారు. ఈ క్రమంలో ఇవాళ జరిగే సమావేశానికి ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశాలున్నాయి. 

ఇదిలా ఉంటే.. ఇదే తరహాలో మంగళవారం రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌కడ్‌(ఉపరాష్ట్రపతి) మంగళవారం భేటీ నిర్వహిచంగా.. చాలా పార్టీలు గైర్హాజరు అయ్యాయి. హస్తినలో అధికార ఎన్డీయే కూటమి బలప్రదర్శన, మరోవైపు బెంగళూరులో విపక్ష కూటమి భేటీ నేపథ్యంలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది.

ఈసారి వర్షాకాల సమావేశాలు వాడీవేడిగా సాగొచ్చు.  ‘జాతీయ ప్రజాతంత్ర కూటమి’ (ఎన్డీయే) కూటమి వర్సెస్‌ విపక్ష కూటమి ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంటల్‌ ఇన్‌క్లూజివ్‌ అలయెన్స్‌(ఐఎన్‌డీఐఏ) మధ్య పరిణామాలు రసవత్తరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

ఇదిలా ఉంటే..  రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పార్లమెంట్‌సమావేశాల్లో వ్యవహరించాల్సిన వ్యూహంపై కేబినెట్‌ సహచరులు ప్రహ్లాద్‌ జోషి(పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి), పీయూష్‌ గోయల్‌(రాజ్యసభ నేత)లతో చర్చించారు. ఆపై ఎన్డీయే మిత్రపక్షాలతోనూ బీజేపీ నేతలు ఇవాళ చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Videos

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)