Breaking News

బాలినేని.. జగన్‌ గురించి మాట్లాడే స్థాయేనా నీది?

Published on Sat, 03/15/2025 - 12:16

ప్రకాశం, సాక్షి: జనసేన ఆవిర్భావ సభలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశిస్తూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి(Balineni Srinivasa Reddy) చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ భగ్గుమంది. వైఎస్సార్‌సీపీ ఇచ్చిన అధికారంతో పదవి అనుభవించడమే.. అడ్డగోలుగా అకమార్జనకు పాల్పడ్డారని, పైగా కోవర్టు రాజకీయాలతో బాలినేని పార్టీని ఘోరంగా దెబ్బ తీశారని వైఎస్సార్‌సీపీ నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

‘‘బాలినేని.. నీ మంత్రి పదవి త్యాగం చేశావా?. కనబడ్డ భూమి అంతా కబ్జా చేశావ్‌. ఒంగోలులో బ్రాహ్మణుల భూమి కాజేశావు. వేల కోట్ల రూపాయలతో సామ్రాజ్యం నిర్మించుకున్నావ్‌.  నీ చరిత్ర ఏంటో మొత్తం ప్రకాశం జిల్లాకి తెలుసు. వైవీ సుబ్బారెడ్డి ద్వారానే కదా నువ్వు వైఎస్సార్‌కు బంధువైంది. అలాంటిది జగన్‌ వెంట నడవడానికే నెలల తరబడి ఆలోచించావు కదా?. 

నువ్వు ఆస్తులు అమ్ముకున్నావా?. మీ నాన్న ఆస్తి ఎంత ఉంది.. ఎక్కడ అమ్మావు?. కోట్ల రూపాయల ఖర్చు చేసి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని రష్యా వెళ్తావు. కాసినోకు వెళ్తా అని  నువ్వే చెప్పావు.. బహుశా ఆస్తి అంతా అక్కడే పోగొట్టావా?. మొదటి నుండి నువ్వొక టీడీపీ కోవర్టువి. ఆ పార్టీలో కుదరక పోవడంతోనే జనసేనలో చేరావ్‌. నీలాంటి వాడికి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి(Jagan Mohan Reddy) గురించి మాట్లాడే స్థాయి ఉందా?’’ అంటూ వైస్సార్సీపీ ఒంగోలు ఇంచార్జ్ కామెంట్స్ చుండూరి రవి బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

జిల్లాలో వైఎస్సార్‌సీపీ ఓటమికి బాలినేనే కారణమని మాజీ పీడీసీ బ్యాంకు చైర్మన్ డాక్టర్ మాదాసు వెంకయ్య  ఆరోపించారు. బాలినేని గ్రూపులు చేసి పార్టీని భ్రష్టుపట్టించారు. ఇక్కడి విషయాలు జగన్‌ దాకా చేరకుండా అడ్డం పడ్డారు. ఇప్పుడు ఆయన పార్టీని వీడాక స్వేచ్ఛగా ఉంది. అధికారం అనుభవించి కోట్లు పోగేసుకున్న బాలినేని.. ఇప్పుడు ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారాయన. 

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)