Breaking News

మహారాష్ట్ర ఎన్నికలు: పూజా ఖేద్కర్‌ తండ్రి అఫిడవిట్‌లో.. మరో సందేహం?

Published on Mon, 10/28/2024 - 08:31

ముంబై: త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అహ్మద్ నగర్ సౌత్ నుంచి మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తండ్రి దిలీప్ ఖేద్కర్  స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.

దీనిలో దిలీప్ ఖేద్కర్ తాను విడాకులు తీసుకున్నట్లు వెల్లడించారు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆయన దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఇచ్చిన సమాచారానికి భిన్నమైన వివరాలు దీనిలో ఉన్నాయి. కొద్ది నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దిలీప్ ఖేద్కర్ తాను మనోరమ ఖేద్కర్‌ను వివాహం చేసుకున్నట్లు వెల్లడించారు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో దిలీప్ ఖేద్కర్ అహ్మద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వంచిత్ బహుజన్ అఘాడీ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. నాడు లోక్‌సభ ఎన్నికల్లో దాఖలు చేసిన అఫిడవిట్‌లో దిలీప్ ఖేద్కర్.. మనోరమ ఖేద్కర్‌ను తన భార్యగా పేర్కొన్నారు. నాటి అఫిడవిట్‌లో దిలీప్ ఖేద్కర్ తమ ఉమ్మడి ఆస్తుల వివరాలను తెలిపారు. తన కుటుంబాన్ని అవిభక్త హిందూ కుటుంబంగా  పేర్కొన్నారు.

దిలీప్, మనోరమ ఖేద్కర్ 2009లో పూణే ఫ్యామిలీ కోర్టులో పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారని  ఒక మీడియా సంస్థ తెలిపింది. వారిద్దరూ 2010, జూన్ 25న విడిపోయారు. విడాకులు తీసుకున్నప్పటికీ, ఈ జంట పూణేలోని బానర్ ప్రాంతంలోని మనోరమా ఖేద్కర్ బంగ్లాలో సహజీవనం కొనసాగించారు.

కాగా రిజర్వేషన్ ప్రయోజనాలను పొందేందుకు యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (2022) కోసం ఆమె చేసిన దరఖాస్తులో తప్పుడు సమాచారాన్ని అందించినందుకు పూజా ఖేద్కర్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) సస్పెండ్ చేసింది. అయితే ఆమె ఈ ఆరోపణలను ఖండించారు. ఢిల్లీలోని వివిధ అకాడమీలలో తన మాక్ ఇంటర్వ్యూలలో పూజా ఖేద్కర్ తన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నందున తన కుటుంబ ఆదాయం సున్నా అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె తన తల్లితోపాటు ఉంటోంది. అయితే, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా దిలీప్‌ ఖేద్కర్‌ దాఖలు చేసిన అఫిడవిట్‌లో  ఆయన తన ఆస్తుల విలువను రూ.40 కోట్లగా చూపారు. 

ఇది కూడా చదవండి: లింగ సమానత్వంలో భారత్‌ ముందడుగు 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)