Breaking News

ఎన్నికల ‍ప్రచారంలో నటుడు గోవిందాకు అస్వస్థత

Published on Sun, 11/17/2024 - 06:52

ముంబయి: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న నటుడు గోవిందా  అస్వస్థతకు గురయ్యాయి. జల్‌గావ్‌లోని ముక్తైనగర్, బోద్వాడ్, పచోరా, చోప్రాలలో మహాయుతి అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం పచోరాలో రోడ్ షో నిర్వహిస్తుండగా  గోవిందా ఛాతీ నొప్పితో బాధపడ్డారు. వెంటనే ఇతర నేతలు గోవిందాను ఆస్పత్రికి తరలించారు.

మహాయుతిలోని శివసేన (షిండే వర్గం) నేత  గోవిందా పచోరాలో రోడ్ షో నిర్వహిస్తున్న సమయంలో అనారోగ్యం పాలవడంతో మధ్యలోనే ప్రచార కార్యక్రమాన్ని నిలిపివేశారు. ఈ రోడ్ షోలో గోవిందా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మద్దతు ఇవ్వాలని, బీజేపీ, శివసేన, ఎన్‌సీపీతో కూడిన అధికార కూటమికి ఓటు వేయాలని ప్రజలను కోరారు.

ఇటీవల ముంబైలోని తన ఇంట్లో ప్రమాదవశాత్తూ తుపాకీ పేలడం వల్ల గోవిందా కాలికి గాయమైంది. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గోవిందా త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. నాడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత గోవింద తొలుత వీల్ చైర్ లో కనిపించారు. తన ఆరోగ్యం కోసం ప్రార్థనను చేసిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.

నవంబర్ 20న మహారాష్ట్రలోని అన్ని స్థానాలకు ఓటింగ్ జరిగనుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 23న నిర్వహించనున్నారు. నవంబర్ 18తో ఎన్నికల ప్రచారం ముగియకముందే అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారంలో తమ సత్తా చాటాయి. ఈ క్రమంలో గోవిందా శివసేన, మహాయుతిల ప్రచారానికి వెళ్లారు. గోవిందా పాల్గొన్న రోడ్ షోను తిలకించేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు.

ఇది కూడా చదవండి: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌ 
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)