Breaking News

ఇండియా కూటమిలో బిగ్‌ ట్విస్‌.. కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఆప్‌!

Published on Thu, 12/26/2024 - 12:51

ఢిల్లీ: ఇండియా కూటమి రాజకీయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్‌ పార్టీ దూరం పెట్టాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ భావిస్తున్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. ఢిల్లీ ఎన్నికల వేళ ఆప్‌పై కాంగ్రెస్‌ ఆరోపణలే కారణమని తెలుస్తోంది.

దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఇండియా కూటమిలో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. కూటమి నుంచి కాంగ్రెస్‌ను పంపించేలా ఇతర పార్టీలను ఒప్పించడానికి ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రయత్నం చేస్తున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఎన్నికల సందర్భంగా ఆచరణ సాధ్యం కాని హామీలు అమలు చేస్తామని కేజ్రీవాల్‌ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్‌ ఆరోపించిన నేపథ్యంలో ఆప్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆప్‌ వర్గాల నుంచి ఇలాంటి స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో, భవిష్యత్‌లో కూటమి రాజకీయంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో ఇండియా కూటమిలో కోల్డ్‌ వార్‌ నడుస్తున్న విషయం తెలిసిందే. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమే ఇందుకు కారణం. ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీ చేయడం, ఓడిపోవడంతో కూటమి నేతలు ఆసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఇండియా కూటమికి తాను చీఫ్‌గా ఉండాలనుకుంటున్నట్టు మమతా బెనర్జీ చెప్పడంతో మరింత ఉత్కంఠను పెంచింది. ఈ క్రమంలో కూటమిలో పలు పార్టీల నేతలు కూడా మమతకు మద్దతుగా నిలిచారు. ఇలాంటి పరిణామాల మధ్య ఆప్‌ తాజా నిర్ణయం కూటమిలో చిచ్చు పెట్టిందని పొలిటికల్‌ సర్కిల్‌ చర్చ నడుస్తోంది.

Videos

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)