Breaking News

Bhagwant Mann: పంజాబ్‌ సీఎం ఇంట్లో పోలీసుల సోదాలు!

Published on Thu, 01/30/2025 - 19:01

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశి.. ఢిల్లీలోని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్‌ సింగ్‌ (Bhagwant Mann Singh) నివాసం వద్ద పోలీసు బలగాలు మోహరించారని చెప్పారు. ఈ ఘటన ఒక్కసారిగా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. సీఎం అతిశి వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటరిస్తున్నారు.

తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశి ట్విట్టర్‌ వేదికగా.. పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్‌ సింగ్‌ నివాసం వద్ద పోలీసు బలగాలు మోహరించారు. ముఖ్యమంత్రి నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించేందుకు వచ్చారు. కానీ, బీజేపీ చేసిన తప్పులను, కాషాయ పార్టీ నేతలను మాత్రం పోలీసులు పట్టించుకోవడం లేదు. బీజేపీ నేతలు పట్టపగలే డబ్బులు పంచినా ఎందుకు పట్టించుకోవడం లేదు. ఎన్నికల కోసం వస్తువులను ప్రజలకు పంచేందుకు వెళుతున్నారు అయినప్పుటికీ పోలీసుల నుంచి స్పందన కరువైంది. కానీ, ప్రజలు ఎన్నుకున్న నాయకుడి ఇంటి పైకి సోదాలు చేసేందుకు మాత్రం వచ్చారు’ అంటూ మండిపడ్డారు. దీంతో, ఆమె వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి.

మరోవైపు.. సీఎం అతిశి ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. తాము సీఎం నివాసంలో ఎలాంటి సోదాలు చేపట్టలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్బంగా సీ-విజిల్‌ పోర్టల్‌లో వచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు కోసం రిటర్నింగ్‌ ఆఫీసర్‌ నేతృత్వంలోని పోలీసు బృందం పంజాబ్‌ సీఎం నివాసానికి రావాల్సి వచ్చిందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. అయితే.. అక్కడున్న భద్రతా సిబ్బంది పోలీసుల బృందాన్ని దర్యాప్తు చేసేందుకు అనుమతించలేదని తెలిపారు.

ఇదిలా ఉండగా.. అతిశి ఆరోపణలపై బీజేపీ నేతలు కౌంటరిస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఆప్‌ నేతలు ఇలా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ నేతలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఇక, ఢిల్లీ ఎన్నికల వేళ యమునా నది నీళ్ల విషయం కూడా సంచలన మారిన సంగతి తెలిసిందే. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)