Breaking News

‘ఢిల్లీలో కరెంట్‌ కష్టాలు.. ప్రజలు ఇన్వెర్టర్లు కొంటున్నారు’

Published on Thu, 02/13/2025 - 17:12

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ(BJP) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 70 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాలో అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇక ఆప్‌ 22 స్థానాలతో ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది. ఢిల్లీలో అప్పుడే కరెంట్‌ కష్టాల్లో మొదలయ్యాయంటూ ఆప్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి అతిషి(Atishi) ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన మూడు రోజుల్లోనే ఢిల్లీలో కరెంట్‌ కష్టాలు ఆరంభం అయ్యాయంటూ సెటైర్లు వేశారు. 

బీజేపీకి ఎలా పరిపాలించాలో తెలియడం లేదు. ప్రధానంగా పరిస్థితిని బట్టి కరెంట్‌ సదుపాయాన్ని ప్రజలకు పూర్తి స్థాయిలో ఇవ్వడంలో బీజేపీ అప్పుడే విఫలమైంది. దీనిపై నాకు ఇప్పటికే చాలా ఫిర్యాదులొచ్చాయి. చాలా ఏరియాల నుంచి పలు ఫిర్యాదులు నా దృష్టికి వచ్చాయి. ప్రజలు అప్పుడే కరెంట్‌ ఉంటుందనే నమ్మకం కోల్పోయారు. వారు ఇన్వెర్టర్లు కొనుగోలు  చేయడం ఇప్పటికే ఆరంభించారు. . ఢిల్లీని యూపీ తరహాలో మార్చబోతున్నారు అనడానికి ఇదే ఉదాహరణ’ అని ఆమె విమర్శించారు.

ఢిల్లీలో అధికారం చేజిక్కించుకున్న బీజేపీ.. ఇంకా అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయలేదు. ప్రధాని మొదీ అమెరికా పర్యటన అనంతరం ఢిల్లీ సీఎంను ప్రకటించే అవకాశం ఉంది.  ఢిల్లీ సీఎంగా  బీజేపీ ఇంకా ఎంపిక చేయకుండానే, పూర్తి స్థాయి పరిపాలన బాధ్యతలు తీసుకోకుండానే ఆప్‌ విమర్శలు చేయడాన్ని కూడా పలువురు తప్పుబడుతున్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)