Breaking News

మోదీకి సవాల్‌.. అలా జరిగితే బీజేపీకి ప్రచారం చేస్తా: కేజ్రీవాల్‌

Published on Sun, 10/06/2024 - 17:02

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆప్‌ జాతీయ కన్వీనర్‌, మాజీ సీఎం కేజ్రీవాల్‌ స్పీడ్‌ పెంచారు. కేంద్రంలోని బీజేపీని టార్గెట్‌ చేస్తూ సవాల్‌ విసిరారు. ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్న 22 రాష్ట్రాల్లో ఉచిత కరెంట్‌ హామీ అమలు చేస్తే తాను బీజేపీకి మద్దతిస్తానని చెప్పుకొచ్చారు.

మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌.. ప్రధాని మోదీకి సవాల్‌ విసిరారు. ఢిల్లీలో నిర్వహించిన ‘జనతా కీ అదాలత్‌’ పేరిట ఆప్‌ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు దేశంలోని 22 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ప్రజలకు ఉచిత విద్యుత్తు హామీని అమలు చేస్తే నేను బీజేపీ తరఫున ప్రచారం చేస్తాను. నా డిమాండ్‌ను నెరవేర్చేందుకు బీజేపీ సిద్ధమేనా?. దీనికి ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని సవాల్‌ చేస్తున్నా. దేశంలో బీజేపీ డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాలు అంతటా విఫలం అయ్యాయి. జమ్ము కశ్మీర్‌, హర్యానాలో బీజేపీకి ఓటమి తప్పదు. బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. దేశంలో డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాలు అంటే.. ద్రోవ్యోల్బణం, అవినీతి, నిరుద్యోగమే అని కామెంట్స్‌ చేశారు.

ఇదే సమయంలో ఢిల్లీలో పరిస్థితులపై కేజ్రీవాల్‌ మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ.. బస్‌ మార్షల్స్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్లను తొలగించడంతో పాటు ఢిల్లీలో హోమ్‌గార్డుల వేతనాలను నిలిపివేసిందన్నారు. దేశ రాజధానిలో ప్రజాస్వామ్యం లేదని.. అక్కడ ఎల్జీరాజ్యం నడుస్తోందని ఆరోపించారు. అలాగే, బీజేపీ అంటేనే పేదలకు వ్యతిరేకం అంటూ ఘాటు విమర్శలు చేశారు. <

ఇది కూడా చదవండి: కోల్‌కతా ఆర్జీ కర్‌ ఆస్పత్రి: 10 మంది డాక్టర్లపై బహిష్కరణ

 

Videos

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)