Breaking News

‘షిండే ముఖ్యమంత్రి కాదు.. కాంట్రాక్టర్‌ మంత్రి’

Published on Wed, 10/16/2024 - 08:49

ముంబై:  మహారాష్ట్రలో  బీజేపీ  నకిలీ హిందుత్వను ప్రచారం చేస్తోందని శివసేన( యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే మండిపడ్డారు. ఆయన ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏక్‌నాథ్ షిండే.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి కాదు.. ఒక కాంట్రాక్టర్ మంత్రి అని అన్నారు. హిందుత్వ పట్ల తమ పార్టీ, బీజేపీ ఆదర్శలు, వైఖరికి స్పష్టమైన తేడాలు ఉన్నాయని  తెలిపారు.

‘‘ మేము పాటించే హిందుత్వం బీజేపీ హిందుత్వం ఒకటి కాదు. మా హిందుత్వ సంస్కరణలు.. ప్రజలు ఏం తినాలి, ధరించాలి అనే వాటిపై ఎలాంటి ఆంక్షలు విధించకుండా ఉంటాయి. మతపరమైన విలువలను కాపాడుతాయి. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలపై మౌనంగా ఉంటూ.. మన దేశంలోని ముస్లింలపై బీజేపీపై దాడి చేయాలనుకుంటోంది.ఎన్నికల ప్రయోజనాల కోసం అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించింది. 

అదే సమయంలో మా పార్టీ రాజకీయాలు చేయకుండా అనేక ఆలయాలను సందర్శించింది. 2022లో శివసేన నుంచి ఏక్‌నాథ్‌ షిండే.. పార్టీ ఫిరాయించి.. ఎందుకు పారిపోవాల్సి వచ్చింది?. కాంట్రాక్టర్ల ప్రయోజనాలను కాపాడే నాయకుడిగా షిండేకు పేరుంది. ఈ ముఖ్యమంత్రి సామాన్యుడు కాదు. కాంట్రాక్టర్ మంత్రి. నేను ఓడిపోయినా మహారాష్ట్ర, ముంబై కోసం పోరాటం ఆపను’’ అని అన్నారు.

ఇక.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. మహారాష్ట్రలో ఒకే దశలో నవంబర్ 20న ఎన్నికలు జరగనుండగా.. నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి. 

చదవండి: వయనాడ్‌ ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ

Videos

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్..!

విజయవాడ పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన

కేసీఆర్ ఫాంహౌస్ వద్ద 144 సెక్షన

మహికాతో బ్రేక్ అప్? అమీషా పటేల్ తో హార్దిక్ డేటింగ్!

Photos

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)