Breaking News

కీలక సమావేశానికి షిండే డుమ్మా.. మహాయుతిపై ఆదిత్య ఠాక్రే సెటైర్లు

Published on Sun, 12/01/2024 - 17:06

ముంబై : ‘మహరాష్ట్రలో అసెంబ్లీ ఫలితాలు విడుదలై వారం రోజులవుతుంది. ఇంత వరకూ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరో స్పష్టత ఇవ్వకపోవడం దారుణం. అధికార మహాయుతి కూటమికి రాష్ట్రంపై ఉన్న అశ్రద్ధకు ఇదే నిదర్శనం’ అంటూ శివసేన (యూబీటీ) ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే మండిపడ్డారు.

మహరాష్ట్రలోని ప్రస్తుత రాజకీయాలపై ఆదిత్య ఠాక్రే ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఫలితాల విడుదలై వారం రోజులవుతున్నా ఓ ముఖ్యమంత్రిని నిర్ణయించలేకపోతున్నారని మహాయుతి కూటమిపై సెటైర్లు వేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా రాష్ట్రాన్ని గాలికొదిలేశారు.  

 

ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో అధికార మహాయుతి కూటమి తీరు చూస్తుంటే నిబంధనలు ప్రతిపక్ష పార్టీలకు వర్తిస్తాయని, అధికార పార్టీలకు వర్తించవని తెలుస్తోంది. గవర్నర్‌కు సంఖ్యాబలం చూపకుండానే ఏకపక్షంగా ప్రమాణ స్వీకార తేదీని ప్రకటించడం అరాచకం’అని ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. 

కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మహాయుతి కూటమి కీలక సమావేశం జరుగాల్సి ఉంది. అయితే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అనూహ్యంగా సతారా జిల్లాలోని తన గ్రామానికి వెళ్లడం చర్చాంశనీయంగా మారింది. ఓ వైపు కీలక సమావేశం ఉన్నా ఏక్‌నాథ్‌ షిండే గైర్హాజరు కావడం మహరాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఈ తరుణంలో ఆదిత్య ఠాక్రే ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ పై విధంగా వ్యాఖ్యానించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)