Breaking News

కేటీఆర్‌ వ్యాఖ్యల ఎఫెక్ట్‌.. బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌

Published on Sun, 10/01/2023 - 19:11

సాక్షి, ఖమ్మం: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ రాజకీయం రసవత్తరంగా మారింది. తాజాగా ఖమ్మం జిల్లాలో పాలిటిక్స్‌ ఆసక్తికరంగా మారాయి. సత్తుపల్లిలో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీకి తుమ్మల వర్గీయలు బిగ్‌ షాకిచ్చారు. దీంతో, అక్కడి రాజకీయం హాట్‌టాపిక్‌గా మారింది. 

వివరాల ప్రకారం.. సత్తుపల్లిలో బీఆర్‌ఎస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తుమ్మల వర్గీయులు మాజీ ప్రజా ప్రతినిధులు ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా తుమ్మల నాగేశ్వరరావును అవమానించేలా కేటీఆర్‌ మాట్లాడిన మాటలను వ్యతిరేకిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వానికి 500 మంది ‍ప్రజాప్రతినిధులు రాజీనామా చేశారు. 

కేటీఆర్‌ వ్యాఖ్యలపై భట్టి ఫైర్‌..
మరోవైపు ఖమ్మంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువుకున్న కేటీఆర్‌కు ప్రపంచజ్ఞానం ఉందనుకున్నాను. 150 ఏళ్ల కాంగ్రెస్‌ పార్టీపై వారెంటీ లేదు.. గ్యారెంటీ లేదు.. ముసలి నక్కా అని మాట్లాడం అదేం భాష. మీరు ఏం చెప్పాలనుకున్నారో చెప్పుకోండి.. కానీ, ఇదేం పద్దతి. నీ కంటే ఎక్కువ భాష మాట్లాడగలను. సభ్యతా, సంస్కారం అడ్డు వస్తోంది. ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ ఉండాలి. ప్రజలు ఇ‍చ్చే దరఖాస్తు తీసుకునే ధైర్యం నీకు లేదు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదు.. ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్‌కు ప్రజలు 75-80 సీట్లు ఇవ్వబోతున్నారు. 

మేము ఆరు గ్యారెంటీలు ప్రకటించాం.. అధికారంలోకి వచ్చాక వంద రోజుల్లో వాటిని అమలు చేస్తాం. గ్యారెంటీలు ప్రజలకు చెందకుండా మీరు కుట్ర చేస్తున్నారు. మేము ప్రకటించాం.. బాగాలేకపోతే లేదని చెప్పండి. మీ కల్వకుంట్ల ఫ్యామిలీ కోసం కాదు.. ప్రజల కోసం గ్యారెంటీలు పెట్టాం. రేపు జరగబోయే ఎన్నికల్లో ఓట్లు కాంగ్రెస్‌కు వేస్తారు.. మీ బెదిరింపులకు కాదు. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌రావుకు ప్రజలకు బుద్ధి చెబుతారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి: ప్రధాని మోదీ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌..

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)