Breaking News

ఓటమి దిశగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

Published on Tue, 06/04/2024 - 12:16

కాంగ్రెస్‌ కంచుకోట అమేథీ నుంచి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది.  2024 ఎన్నికల్లో ప్రతిష్టాత్మక పోరుగా భావిస్తున్న అమేధీ నుంచి ఆమె వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమిదిశగా పయనిస్తున్నారు..  కి కాంగ్రెస్‌ అభ్యర్థి, గాంధీ కుటుంబ విధేయుడు కేఎల్ శర్మ 28వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. నువ్వే నేనా అన్నట్టుగా సాగుతున్న ఈ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో ఉత్కంఠగా మారింది.

శర్మకు  గత 40 సంవత్సరాలుగా అమేథీతో అనుబంధం ఉంది. అమేథీలో  ప్రియాంక గాంధీ వాద్రా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అమేథీకి మూడు పర్యాయాలు ఎంపీగా గెలిచిన రాహుల్ 2019లో ఇరానీ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. 

అటు దేశవ్యాప్తంగా కూడా బీజేపీకి ఫలితాలు ఆశాజనకంగా లేవు. ఇండియా కూటమి దాదాపు226పైగా సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. అటు 2019లో భారీ మెజార్జీసాధించిన బీజేపీ గతంతో  పోలిస్తే 61 సీట్లతో నష్టంతో కేవలం 291 సీట్లలో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది.  ఈ నేపథ్యంలో అధికారం పీఠం ఎవరికి దక్కనుంది అనేదానిపై  తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

అమేథీ చరిత్ర ఇదీ
1980లో సంజయ్ గాంధీ విజయంతో వారసత్వం ప్రారంభమైంది. అతని ఆకస్మిక మరణం తరువాత, అతని సోదరుడు రాజీవ్ గాంధీ 1981 ఉప ఎన్నికలలో విజయం సాధించారు మరియు 1984, 1989 , 1991లో విజయం సాధించారు. రాజీవ్ హత్య తర్వాత, కుటుంబ విధేయుడైన సతీష్ శర్మ 1991 ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. 1999లో సోనియాగాంధీ, 2004, 2009, 2014లో రాహుల్‌గాంధీ  అమేథీ ఎంపీ స్థానాన్ని గెలుచుకున్నారు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)