Breaking News

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఉగాది ఉత్తమ రచనల పోటీ!

Published on Wed, 04/10/2024 - 16:14

తెలుగు వారి ఉగాది పండుగను విదేశాల్లో ఉన్న భారతీయ తెలుగు ప్రజలు కూడా ఆనందంగా సెలబ్రేట్‌ చేసుకున్నారు. కొన్ని ఈ పండుగ సందర్భంగా భారత్‌లో జరిగినట్లే  కవి సమ్మేళనాలు, రచనల పోటీలు వంటి వాటిని విదేశాల్లోని తెలుగు ప్రజల కమ్యూనిటీలు నిర్వహిస్తున్నాయి. పైగా మన సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పేలా సగర్వంగా చేసుకుంటున్నారు. అలాంటి కార్యక్రమాలనే అమెరికాలోని వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించి ఉగాది వేడుకులను ఘనంగా చేసుకున్నారు.

ఈ మేరకు క్రోధి” నామ సంవత్సర ఉగాది (ఏప్రిల్ 9, 2024) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు ఉగాది ఉత్తమ రచనలు పోటీలు నిర్వహించారు. ఇలా ప్రతి ఏడాది పెట్టడం జరుగుతుంది. ఈసారి జరిగినవి 29వ ఉగాది ఉత్తమ రచనల పోటీలు. ఈ పోటీల్లో ఉత్మ రచనలుగా ఎంపికయ్యిన వాటి వివరాలను వెల్లడించారు నిర్వాహకులు. ఇక ఈ పోటీల్లో అమెరికా, కెనడా, భారత దేశం, దక్షిణ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా మొదలైన పలు దేశాల నుంచి భారతీయులు పాలు పంచుకోవడం విశేషం. ఈ పోటీల్లో  “నా మొట్టమొదటి కథ”, “నా మొట్టమొదటి కవిత” విభాగాలకు ఎక్కువమంది పోటీపడడ్డారు.

ఈ మేరకు నిర్వాహకులు మాట్లాడుతూ..అన్ని రచనలకూ సర్వహక్కులూ రచయితలవే. బహుమతి పొందిన రచనలు, ప్రచురణకి అర్హమైన రచనలూ  కౌముది.నెట్, ‘మధురవాణి. కామ్, సిరిమల్లె. కామ్ మొదలైన పత్రికలలో  ఆయా సంపాదకుల నిర్ణయానుగుణంగా ప్రచురించడం జరుగుతుంది. ఈ పోటీకి ఆర్ధిక సహకారం అందించిన మునుగంటి జితేందర్ రెడ్డి (హ్యూస్టన్)కి అందరి తరఫునా ధన్యవాదాలు అని చెప్పారు. కాగా, ఈ పోటీల్లో ఎంపికైన రచనలు, కవితలు, కథల వారిగా వివరాలు ఇలా..!

ఉత్తమ కథానిక విభాగం విజేతలు
‘ఓర్నీ అమ్మ’’- శర్మ దంతుర్తి (Elizabeth Town, OH) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) 

 “అసంకల్పిత ప్రతీకారాలు”- పాణిని జన్నాభట్ల (Boston, MA) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) 

‘వలస కూలీలు’ -నిర్మలాదిత్య (భాస్కర్ పులికల్), Tampa, FL- ప్రశంసా పత్రం

‘వైకుంఠపాళీ’- మధు పెమ్మరాజు (Katy, TX) -ప్రశంసా పత్రం

ఉత్తమ కవిత విభాగం విజేతలు

“కవిత్వం” - గౌతమ్ లింగా (జొహానెస్ బర్గ్, దక్షిణ ఆఫ్రికా) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

“పశ్ర్న”- శ్రీధర్ బిల్లా, Fremont, CA ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

 “ఎంకి నాయుడు బావ”- మణి మల్లవరపు (Vancouver, Canada) ప్రశంసా పత్రం

“మొట్టమొదటి రచనా విభాగం” -16వ సారి పోటీ

“నా మొట్టమొదటి కథ” విభాగం విజేతలు

‘వేలెత్తి చూపిన పిల్లి’ - జీ.కే. సుబ్రహ్మణ్యం ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

‘రేసు గుర్రం - కోరుకొండ దుర్గాబాయి ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)  

పల్లెకు పోదాం ఛలో, ఛలో- రాపోలు సీతారామరాజు - ప్రశంసా పత్రం

"నా మొట్ట మొదటి కవిత” విభాగం విజేతలు

“విరహ ప్రస్థానం”- దాసశ్రీ (దేవేంద్ర దాసరి) పెద్దహరివనం, కర్నూలు ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

“నీవు ఎవరు? కాస వైశ్విక (తిర్మలాపూర్, జగిత్యాల జిల్లా) ($116 నగదు పారితోషికం (ప్రశంసా పత్రం)

కాలంతో కరచాలనం రిషిత్ సిరికొండ గొల్లపల్లి, జగిత్యాల జిల్లా (ప్రశంసా పత్రం)

తదితర రచనలు, కవితలు,క థలను ఎంపికయ్యాయి. ఇక ఈ పోటీలకు సహకరించిన న్యాయ నిర్ణేతలకి, అలాగే ఇందులో పాల్గొన్న రచయితలకి ధన్యవాదాలని చెప్పారు నిర్వాహకులు.  ఈ కార్యక్రమాలను జయప్రదం చేసినవారు శాయి రాచకొండ, దీప్తి పెండ్యాల, వంగూరి చిట్టెన్ రాజు తదితరులు.

(చదవండి: ఏరియల్ రోప్ వే.. అదో అద్భుత ప్రయాణ అనుభూతి!)


 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)