Breaking News

ట్రంప్‌ 2.0 అమెరికాలో భారతీయ విద్యార్థుల భవిష్యత్‌ ఏంటి?

Published on Sat, 11/16/2024 - 12:12

ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, అమెరికాకు  అధ్యక్షుడిగా డొనాల్ట్‌ ట్రంప్‌ రెండోసారి ఎంపికయ్యాడు. గతంలో ట్రంప్‌ విదేశీ వలసలు, గ్రీన్ కార్డులు, వీసాలపై కీలక వ్యాఖ్యలు  చేసిన నేపథ్యంలో అమెరికా డాలర్‌డ్రీమ్స్‌ కంటున్న విద్యార్థుల భవిష్యత్‌ ఏంటి?  అనేది  చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కొన్ని కీలక విషయాలను చూద్దాం.

ట్రంప్‌ 2.0లో ప్రభావితమయ్యే మరో అంశం స్టూడెంట్స్ వీసాలు, ఉద్యోగాలు. ట్రంప్‌ పాలనలో విద్యార్థి వీసాలకు ఢోకా ఉండకపోవచ్చు. కానీ ప్రత్యేకించి H1B వీసాలు కఠినతరం కానున్నాయి. ఇమ్మిగ్రేషన్‌ నిబంధనలు మారనున్నాయి. వర్క్‌ వీసాలు కష్టమయ్యే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే మాస్టర్స్‌ చదివి.. అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకుంటున్న వారి ఆశలపై నీళ్లు చల్లినట్లే.. అయితే ఎడ్యుకేషన్‌ వీసాల పట్ల ట్రంప్‌ సానుకూలంగానే ఉండే అవకాశం ఉంది.

లే ఆఫ్‌.. ఆర్థిక మాంద్యం.. ఆంక్షలు, నిరుద్యోగం వంటి సమస్యలు అమెరికాలో భారతీయ విద్యార్థులను వెంటాడే సమస్యలు.  అమెరికాలో నైపుణ్యం గల యువతలో భారతీయులే అధికం. దీంతో పాటు ఫ్రెషర్స్‌కు భారత్ పోల్చితే అమెరికాలో వేతనాలెక్కువ. డాలర్‌ ప్రభావం కూడా అధికం. అమెరికాలో 4500కు పైగా యూనివర్సిటీలు, 8 వేలకు పైగా కాలేజీలున్నాయి. విదేశీయులు జాయిన్ అయితేనే అమెరికాలో వర్సిటీలు, కాలేజీల్లో సీట్లు నిండుతాయి. దీంతో స్టూడెంట్‌ వీసాలకు ఢోకా ఉండదనే చెప్పాలి. ఇక అమెరికాలో చదువుకుంటే చదువు అయిపోగానే గ్రీన్‌ కార్డు ఇస్తామని ట్రంప్‌ గతంలో హామీ ఇచ్చాడు ? మరి ఇది అమలవుతుందా? లేదా? కొత్త ప్రభుత్వం ఏం చేస్తుందన్నది భవిష్యత్తులో తేలనుంది.  

ఉద్యోగ అవకాలు పెరుగుతాయా.. ?
ట్రంప్ విధానాల కారణంగా అమెరికా సిటిజన్స్, గ్రీన్ కార్డు హోల్డర్స్ కు ఉద్యోగ అవకాశాలు పెరిగే ఛాన్స్  ఉంది.  అలాగే అధిక నైపుణ్యం గల విద్యార్థులకు ప్రాధాన్యతనిస్తారు. అమెరికాలో వర్క్‌ ఫోర్స్‌కు డిమాండ్‌ మరింత పెరగనుంది. దీంతో హెచ్‌1 వీసాలు జారీ చేయాల్సి ఉంటుంది.

అయితే గతంతో పోల్చితే భారతీయ వృత్తి నిపుణుల విషయంలో ఆయన కొంత సానుకూల వైఖరి కనబరుస్తున్నారు. దీంతో H1B,OPT వారికి కూడా జాబ్స్ పరంగా  ఇబ్బంది ఉండకపోవచ్చు.  లీగల్ గా వర్క్ చేసే వారికి ట్రంప్ పాలనలో మంచి అవకాశాలు లభిస్తాయి. అదే సమయంలో ఇల్లీగల్ గా అమెరికాలో  ఉద్యోగాలు చేయాలనుకునే వారికి  గడ్డు పరిస్థితులే ఎదురుకోవాల్సి ఉంటుంది. 

అక్రమ వలసదారులు పట్ల ట్రంప్ వైఖరి
ఇక అమెరికాలోకి అక్రమంగా వచ్చిన వారిని మూకుమ్మడిగా తిప్పి పంపడం.. డిపోర్టేషన్ పై ఇచ్చిన ఎన్నికల హామీకి కట్టుబడి ఉన్నానంటున్నారు ట్రంప్. దీని కోసం ఎంత ఖర్చైనా సరే, తగ్గేది లేదంటున్నారు. మరి అక్రమ వలసదారుల్ని సామూహికంగా తిప్పి పంపిస్తానన్న ఎన్నికల హామీని నిలబెట్టుకోవడం ట్రంప్‌కు అంత ఈజీయేనా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.  సరైనా డాక్యూమెంట్స్ లేకుండా అమెరికాలో ఉంటున్న వారిని గుర్తించి, అరెస్ట్ చేసి వారి సొంత దేశానికి పంపించడం క్లిష్టమైన వ్యవహారం అనే చెప్పాలి.

ట్రంప్ విధానాలు వలసవచ్చిన వారికి గతంలో చాలా సమస్యలు సృష్టించాయి. భారత ఉద్యోగులు, టెక్నాలజీ కంపెనీలపై కూడా తీవ్ర ప్రభావం చూపించింది. ట్రంప్ వలసల విషయంపై చాలాసార్లు బహిరంగంగానే ప్రకటనలు చేశారు. అమెరికా ఎన్నికల్లో ఇది ముఖ్యమైన అంశం. అక్రమ వలసదారులు అమెరికా ప్రజల ఉద్యోగాలను లాగేసు కుంటున్నారని, వారిని వెనక్కు పంపుతానని ట్రంప్ వాగ్దానం చేశారు. ఒకవేళ ఇదే విధానం కొనసాగితే, అమెరికాలో భారతీయులకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయి. భారత టెక్ కంపెనీలు సైతం అమెరికా కాకుండా మిగిలిన దేశాలలో పెట్టుబడులు పెడతాయి.  

ఇదీ చదవండి :  ట్రంప్‌ 2.0: ఎన్నారైల ఎదురుచూపులు ఫలించేనా? లేక ఎదురు దెబ్బనా?

ట్రంప్‌ అయినా, ఇంకొకరైనా అమెరికా అధ్యక్షునికి..అమెరికా ప్రయోజనాలే ముఖ్యం. తరువాతే మరో దేశం. ఇంకా చెప్పాలంటే మొత్తం ప్రపంచాన్ని అమెరికా తమ మార్కెట్‌గా చూస్తుందినటంలో సందేహమే లేదు. మరి కొత్త ప్రభుత్వం ఇమిగ్రేషన్ విషయంలో ఎలాంటి మార్పులు తీసుకు వస్తుందో వేచి చూడాలి.

- సింహబలుడు హనుమంతు
 

Videos

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)