Breaking News

అట్లాంటాలోని గాంధీ విగ్రహానికి తెలంగాణ ఐటీ మంత్రి నివాళులు

Published on Thu, 06/06/2024 - 19:18

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్‌బాబు అట్లాంటాలోని మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. గాంధీ ఫౌండేషన్ ఆఫ్ యూఎస్‌ఏ (ఎఊ్ఖ అ) ఆహ్వానం మేరకు అట్లాంటా వెళ్లిన ఆయన డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ సెంటర్‌లోని గాంధీ కాంస్య విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఫ్రీడమ్ హాల్, గాంధీ రూమ్, కింగ్ రూమ్, ఎటర్నల్ ఫ్లేమ్, ప్రసిద్ధ ఎబినేజర్ బాప్టిస్ట్ చర్చి, కింగ్స్ బర్త్ హోమ్, విజిటర్స్ సెంటర్, కింగ్ క్రిప్ట్‌లను సందర్శించారు.

అట్లాంటాలో గాంధీ విగ్రహ ఏర్పాటుకు సాకారం చేసినందుకు ఇండియన్ ఎంబసీ, ఇండియా కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్, వివిధ కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్‌తో పాటు నేషనల్ పార్క్ సర్వీస్‌కు శ్రీధర్‌ బాబు ధన్యవాదాలు తెలిపారు. ఈ స్మారక చిహ్నం ఏటా కింగ్ పార్క్‌ను సందర్శించే లక్షలాది మంది పర్యాటకులకు అహింస, శాంతి కోసం పోరాడాలనే విషయం గుర్తుకుతెస్తుందన్నారు. 

ఈ కార్యక్రమంలో ప్రముఖ జర్నలిస్ట్, జీఎఫ్‌యూఎస్‌ఏ మీడియా డైరెక్టర్‌ రవి పోణంగి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆంటోనీ థాలియాత్, ఛైర్మన్‌ సుభాష్ రజ్దాన్‌ తదితరులు పాల్గొన్నారు. అమెరికాలోని గాంధీ ఫౌండేషన్‌ను 1997 అక్టోబర్ 26న స్థాపించారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)