Breaking News

టీసీఎస్‌ఎస్‌ ఉపాధ్యక్షులు గోనె నరేందర్ రెడ్డి గుండెపోటుతో కన్నుమూత

Published on Thu, 09/19/2024 - 11:43

తెలంగాణ కల్చరల్ సొసైటి (సింగపూర్) ఉపాధ్యక్షులు గోనె నరేందర్ రెడ్డి (54) 11 సెప్టెంబర్  2024 న తమ సొంత నివాసం లో తీవ్ర గుండెపోటు కు గురై స్థానిక ఎంగ్ టెంగ్ ఫాంగ్ జనరల్ హాస్పిటల్ లో మృతి చెందారు. ఆయన ఆకస్మిక మృతి విషయం తెలుసుకున్న సింగపూర్ లో ఉన్న ఇరు తెలుగు రాష్ట్రాల వారితో పాటు స్థానిక మిత్రులందరూ దుఃఖ సాగరంలో మునిగిపోయారు.  

సొసైటీ సభ్యులు ఈ బాధా సమయం లో నరేందర్ గారు సమాజానికి చేసిన సేవలను  గుర్తు చేసుకున్నారు. సరిహద్దులు దాటి సింగపూరుకొచ్చి, తెలుగోల్లకు తోబుట్టువై, సాగరతీరంలో స్వాతి చినుకువై, సంస్కృతి సంప్రదాయానికి నిలువుటద్దమై, తంగేడుపువ్వుల జాడ చెప్పి, బతుకమ్మకు వన్నె తెచ్చి, పోత రాజుల పౌరుషం పులి రాజుల గాంభీర్యం మాకు పరిచయం చేసి, బోనం అంటే నరేంద్రుడు బతుకమ్మకు పెద్దకొడుకు అంటూ నరేందర్‌ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. టీసీఎస్‌ఎస్‌కు అందించిన సేవలు చాలా గొప్పవంటు ఆయనకు  జోహార్లు  అర్పించారు. వందల సంఖ్యలో మిత్రులు సందర్శనకు వచ్చి ఆశ్రు నివాళి అర్పించారు. 

మృదు స్వభావి,  ఎప్పుడు ప్రతి ఒక్కరిని చిరు నవ్వుతో పలకరించే వారనీ,   సింగపూర్ లో ఉన్న తెలుగు వాసులకు చేసిన సేవలను కొనియాడారు. ఈ దుఃఖ సమయంలో  తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ సభ్యులు ఆయన కుటుంబం వెన్నంటే ఉండి అన్ని విషయాలలో సహాయ సహకారాలు అందించి, ఆయన పార్థీవ దేహాన్ని ఇండియాకు తరలించారు. వారి కుటుంబానికి  ప్రగాడ సానుభూతి ప్రకటించారు.  ఆయన కుటుంబ సభ్యులకు తోడుగా గోనె నరేందర్ సమీప బంధువు ఓరిగంటి శేఖర్ రెడ్డి గారు వారి వెంట ఇండియాకు తోడు వెళ్లారు.

వెల్గటూర్ గ్రామం, కొత్తపేట్ మండలం, జగిత్యాల  జిల్లా కు చెందిన గోనె నరేందర్ గారు గత 25 సంవత్సరాల క్రితం సింగపూర్‌కి వచ్చారు. ప్రస్తుతం  కుటుంబంతో సహా శాశ్వత నివాస హోదాలో  నివసిస్తున్నారు. ఆయనకు భార్య, ఒక కూతురు , కుమారుడు.  ఉన్నారు.


 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)