Breaking News

ఘనంగా తానా ప్రపంచసాహిత్యవేదిక 94వ సమావేశం

Published on Mon, 07/27/2026 - 10:31

తానాసంస్థ సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాలకు పైగా “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.  “ప్రపంచంలోనే వైద్యశాస్త్రానికి ఆద్యుడు – మహర్షి సుశ్రుత” అనే అంశం మీద ఆదివారం జరిగిన 94 వ అంతర్జాల సమావేశం చాలా విజ్ఞానదాయకంగా జరిగింది. 

యూకేలో శస్త్రచికిత్సా వైద్యనిపుణుడిగా ప్రసిద్ధిచెందిన డా. చంద్ర చెరువు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.  తమ కుటుంబం తరపున రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్‌బర్గ్‌లో శస్త్రచికిత్సా పితామహుడు ఆచార్య సుశ్రుతిని 90 కిలోల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. 

ఈ ప్రయత్నంలో సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు అలాగే ఇదే సందర్భంలో వెలువరించిన “మహర్షి సుశ్రుత ఏ కంపెండియం – ఫాదర్ ఆఫ్ సర్జరీ” అనే గ్రంధంలో విలువైన వ్యాసాలను వ్రాసి ప్రోత్సహించిన సహచర వైద్యమిత్రులకు ధన్యవాదములు అన్నారు. వేల సంవత్సరాలనాడే సుశ్రుతుడు సోదాహరణంగా వివరించిన వైద్య పద్దతులు, ఉపయోగించిన శస్త్ర పరికరాల జాబితా పరిశీలిస్తే ఎంతో ఆశ్చర్యం కల్గుతుందని అన్నారు. సుశ్రుతుడు రచించిన “సుశ్రుత సంహిత” గ్రంధంలోని అనేక విషయాలను ఇతర భారతీయ భాషలలోకి, ప్రపంచ భాషలలోకి అనువాదం కావలసిన అవసరం ఉందని, వైద్య విద్యార్థులకు ఆయన పరిశోధనలు, ఆవిష్కారాలు స్ఫూర్తి దాయకంగావాలని ఆకాంక్షించారు. ఇప్పుడు తాము అదే ప్రయత్నంలో ఉన్నామన్నారు.”        
  
తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “వేల సంత్సరాలనాడే ప్రపంచం ఇంకా పూర్తిగా కళ్ళు తెరవకముందే సుశ్రుతుడు సంస్కృతంలో రచించిన 184 అధ్యాయాలగా ఉన్న “సుశ్రుత సంహిత” అనే ఆయుర్వేద గ్రంథం వైద్యులకు మొట్టమొదటి ప్రామాణిక గ్రంథం అన్నారు. మనిషి సాధారణంగా 1,120 రకాల వ్యాధులకు గురిఅవుతాడని, 700 కు పైగా మొక్కల గురించి ఏ మొక్క, ఏ వ్యాధిని, ఎలా తగ్గిస్తుందో ప్రయోగాత్మకంగా నిరూపించాడు. 

64 రకాల ఖనిజాల నుంచి అవసరమైన మందులను ఎలా తయారుచేసుకోవచ్చో వివరించాడు. ఈ గ్రంథంలో 120 శస్త్రపరికరాల గురించి వివరించాడు. ప్రపంచానికి ప్లాస్టిక్ సర్జరీని పరిచయం చేసింది సుశ్రుతుడే! అనస్తీషియా ప్రక్రియకు ఆద్యుడు సుశ్రుతుడు. ప్రొస్టేట్ గ్రంథిని జాగ్రత్తగా తొలగించే పద్ధతి, విరిగిన ఎముకలు తిరిగి అతుక్కునేందుకు శస్త్రచికిత్స సూత్రాలు, తెగిన శరీర భాగాలను అతికించటం, అతి సున్నితమైన పొట్టభాగాన్ని, జీర్ణాశయ పొరలను చీమతలకాయంత సన్నని సూదులతో కుట్లు వేసి అతికించగల్గడం, గర్భిణీస్త్రీ ఉదరంలో శిశువు పరిణామ క్రమం, కొన్ని క్లిష్ట పరిస్థితులలో సిజేరియన్ ఆపరేషన్లు చేసే విధానం, వ్యాధిరహితంగా ఉండేందుకు ఏ ఏ కాలాల్లో, ఎలాంటి కూరగాయలు, పండ్లు తినాలి, ఎలాంటి తృణధాన్యాలు, పప్పుదినుసుల వాడాలి అనే సంపూర్ణ విజ్ఞానం అందించిన సుశ్రుతిని పరిశోధనా విశేషాలను ప్రాధమికదశనుండే విద్యార్థులకు పాట్యాంశంగా చేర్చవలసిన అవసరం ఉందన్నారు.    

విశిష్టఅతిథులుగా పాల్గొన్న డా. బుచ్చిబాబు పైడిపాటి (డెట్రాయిట్ నుండి) సుశ్రుతుడు ఎంతో విపులంగా పేర్కొన్న మెడికల్ ఎథిక్స్ గురించి, డా. వి. కె రాజు (వెస్ట్ వర్జీనియా నుండి) సుశ్రుతుడు చేసిన కంటివైద్య పద్దతుల గురించి, డా. శేషు శర్మ (వాషింగ్టన్ డి.సి నుండి) సుశ్రుత సంహితలో వాత, పిత్త, కఫ దోష పరిస్థితులను ఎదుర్కోవడానికి సరైన ఆహరం, వ్యాయామం, నిద్ర అలవాట్లు ఎంత ముఖ్యమో వివరించారు. 

అలాగే డా. పండరి గంటి (లాస్ ఏంజిల్స్ నుండి) సుశ్రుతుడు ప్రధానంగా ఆయుర్వేద చికిత్సా విధానం ఎలా పనిచేస్తుందో సుశ్రుత సంహిత గ్రంధంలో పేర్కొన్నారని, అది నేటికీ ఫలవంతమైన చికిత్సేనని వెల్లడించారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ పాల్గొన్న అతిథులందరికీ, ఈ కార్యక్రమ విజయానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. 

(చదవండి: ఒత్తిడిని జయించడంపై టాంపాలో నాట్స్ సదస్సు)

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)