Breaking News

స్మాషర్స్ బ్యాడ్మింటన్ గ్రూప్ సింగపూర్ 2025 టోర్నమెంట్‌ ఘన విజయం

Published on Mon, 07/14/2025 - 12:08

సింగపూర్: స్మాషర్స్ బ్యాడ్మింటన్ గ్రూప్ సింగపూర్ 2025 ఆధ్వర్యంలో తెలుగు సంఘానికి ప్రత్యేకంగా నిర్వహించిన బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ ఘన విజయాన్ని సాధించింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ కల్చరల్ సొసైటీ అధ్యక్షులు రమేష్ గడపా, శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు రత్నకుమార్ కవుటూరు, కార్యవర్గ సభ్యుడు శ్రీధర్ భరద్వాజ్, తెలుగు సమాజం నుంచి నాగేశ్ టేకూరి మద్దతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత రాయబార కార్యాలయం నుంచి VSR కృష్ణ, సన్యమ్ జోషి భాగస్వామ్యం  మరో ప్రత్యేకత. 

ఈ టోర్నమెంట్‌లో మొత్తం 40 జట్లు తమ ప్రతిభను చాటుకున్నాయి.  ప్రారంభ రౌండ్లు రౌండ్-రాబిన్ లీగ్ తరహాలో నిర్వహించగా, అనంతరం ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ నుండి నాక్అవుట్ మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగాయి. తుదిపోరులో అనూప్- విజయ్ జంట విజేతలుగా నిలిచింది.  నిర్వాహకులు ద్వారకానాద్ మిట్టా, నవీన్ మల్లం, మహేశ్వర చౌదరి కాకర్ల, సాయి కృష్ణ సేలం, రమేష్ గోర్తి, ఉమామహేశ్వర రావు తెళదేవర, వెమ్మెసెన కులశేఖర్ రీగన్, ప్రసాద్, చంద్రబాబు జొన్నారెడ్డి, విశ్వనాథ్ తదితరులు ఈ విజయంలో సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.   మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్‌ చేయండి!

క్రీడా స్పూర్తిని, సాంఘిక సమైక్యతను,సాంస్కృతిక గౌరవాన్ని ప్రతిబింబించేలా ఈ టోర్నమెంట్‌ సాగింది. ఖచ్చితమైన ప్రణాళిక, స్నేహపూర్వక పోటీలు, ఉత్సాహభరిత వాతావరణంతో ఈ కార్యక్రమం అందరి మెప్పు పొందింది. స్మాషర్స్ బ్యాడ్మింటన్ గ్రూప్ ఈ టోర్నమెంట్‌ను విజయవంతం చేసిన ఆటగాళ్లు, స్వచ్ఛంద సేవకులు, ప్రోత్సాహకులకు  హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. 

ముఖ్యంగా వీరా ఫ్లేవర్స్, సరిగమ, కుంభకర్ణ, ఫ్లింటెక్స్ కన్సల్టింగ్, ERA, ఈస్ట్ కోస్ట్ ఫిజియోథెరపీ సంస్థల సహకారం ఈ టోర్నమెంట్‌కు బలాన్ని చేకూర్చిందని నిర్వాహకులు తెలిపారు. 

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)