Breaking News

డల్లాస్‌లో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం..!

Published on Wed, 10/28/2026 - 11:49

అమెరికాలోని తెలుగు ప్రజలకు ఆధ్యాత్మిక వైభవాన్ని అందించే లక్ష్యంతో గ్రేటర్‌ రాయలసీమ అసోసియేషన్‌ ఆఫ్‌ డల్లాస్‌ ఏరియా(జీఆర్‌ఏడీఏ) ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని అక్టోబర్‌ 31, 2026న నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి  ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటల వరకు టెక్సాస్‌లోని ఫ్రిస్కో ఇండిపెండెన్స్‌ హై స్కూల్‌లో జరగనుంది. ఈ వేడుకకు ఫ్రిస్కో మేయర్ మార్క్ హిల్, మేయర్ ప్రో టెమ్ లారా రమ్మెల్, సిటీ కౌన్సిల్ సభ్యురాలు ఆన్ ఆండర్సన్, FISD ప్రతినిధి సురేష్ మండువాతో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. 

అలాగే ఇతర విశిష్ట అతిథుల్లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె. ధనంజయ రెడ్డి, కార్డియాలజిస్ట్ డాక్టర్ రమణా రెడ్డి, ఎస్‌వీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ డాక్టర్ టి.వి. కృష్ణారెడ్డి, ఎస్‌వీ ఆర్ట్స్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు. కమ్యూనిటీ నాయకులు హరి వెల్కూర్, డాక్టర్ శ్రీధర్ కోర్సపాటి, వైఎస్సార్‌సీపీ యూఎస్ఏ కన్వీనర్ శివ మేకా, డాక్టర్ శ్రీపతి కేతు కూడా పాల్గొననున్నారు. 

తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలను భావితరాలకు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు GRADA నిర్వాహకులు తెలిపారు. డల్లాస్, ఫ్రిస్కో పరిసర ప్రాంతాల్లోని భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఇదీ చదవండి: కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి దంపతులకు శంకరరత్న పురస్కారం

 

 

 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)