Breaking News

ఎన్నారై న్యూస్‌: డల్లాస్‌లో గోరటి వెంకన్న మాట-పాట జోష్‌

Published on Tue, 06/10/2025 - 21:51

అమెరికాలో తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో  తెలుగు సాహిత్యంలో కవితా వైభవం.. డా. గోరటి వెంకన్న మాట – పాట సాహితీసభ జరిగింది. ఆటా , డాటా , డి–టాబ్స్, జిటిఎ, నాట్స్ , టాన్ టెక్స్ , టిపాడ్ సంస్థల సహకారంతో.. డాలస్ లో పెద్ద సంఖ్యలో సాహిత్యాభిమానులతో ఈ కార్యక్రమం  ఉత్సాహంగా, ఉల్లాసంగా జరిగింది. 

గోరటి వెంకన్న కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయనకు మనకాలపు మహాకవి అనే బిరుదును ప్రదానం చేశారు.  సన్మానపత్రం, కిరీటం, దుశ్శాలువాతో, పుష్పగుచ్చాలతో అందరి హర్షాతిరేకాలమధ్య ఘనంగా సన్మానించారు. 

అంతకు ముందు.. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర  అందరి హర్షధ్వానాల మధ్య గోరటి వెంకన్న ను వేదికపైకి ఘనంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డా. గోరటి వెంకన్న అనేక పాటలను  గానం చేశారు.  గల్లీ చిన్నది, గరీబోళ్ల కథ పెద్దది లాంటి ఎన్నో పాటలతో రెండున్నర గంటలపాటు అందరినీ మంత్రముగ్దుల్ని చేశారు.

డా. గోరటి వెంకన్న మాట్లాడుతూ.. ప్రసాద్ తోటకూర  సభానిర్వహణ ఆద్యంతం అందరినీ ఆకట్టుకుందని, తాను చిందులెయ్యకుండా నిలబెట్టి రెండున్నర గంటలపాటు పాటలను, దానిలో ఉన్న సాహిత్యాన్ని రాబట్టిన ఘనత ప్రసాద్ దేనని, ఇలాంటి కార్యక్రమం చెయ్యడం ఇదే తొలిసారి అన్నారు. ఎంతో ప్రేమతో అన్ని సంఘాలను ఒకే వేదికమీదకు తీసుకువచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించిన డా.తోటకూర ప్రసాద్ కు, వివిధ సంఘాల ప్రతినిధులకు, అధిక సంఖ్యలో తరలివచ్చిన సాహిత్యాభిలాషులకు పేరు పేరునా గోరటి వెంకన్న కృతజ్ఞతలు తెలియజేశారు. 

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)