Breaking News

అమెరికాలో శానోజె నగరంలో అద్భుత శివపదం కార్యక్రమం

Published on Mon, 07/28/2025 - 11:13

అమెరికాలో  శానోజె నగరంలో అద్భుత శివపదం కార్యక్రమం జూలై 26న ఘనంగా జరిగింది. శివపదం రచయితసామవేదం షణ్ముఖ శర్మ సమక్షంలో వాణి గుండ్లాపల్లి నిర్వహణలో జరిగిన ఈకార్యక్రమానికి 900 మంది హాజరయ్యారు. ఈ శక్తి ఆ గీతాల్లో ఉందా, భారతీయ నృత్య రీతుల్లో భక్తి తత్త్వం ఉప్పొంగేలా అభినయించిన ఆ కళాకారుల్లో ఉందా అన్నంత సంశయాత్మక సమ్మోహనాన్ని కలిగించాయి దాదాపు 40 మంది కళాకారులు పాల్గొన్నారు.

సామవేదం షణ్ముఖ శర్మ కాలిఫోర్నియాలోని బే ఏరియాలో అయిదురోజులపాటు (జూలై 22-26) జ్ఞానయజ్ఞంగా నిర్వహించిన 'శివ మహిమామృతం 'ప్రవచనోత్సవాలకు పూర్ణాహుతి ఇదే అన్నంత నేత్రపర్వంగా ఆయన రచించిన శివపదాలను వివిధ భారతీయ నృత్య రీతుల్లో అమెరికాలోని కళాకారులు శివ విష్ణు దేవాలయ ప్రాంగణంలోని లకిరెడ్డి ఆడిటోరియంలో ప్రదర్శించారు. 

మోహినీయాట్టంలో బాలా త్రిపుర సుందరి శక్తివర్ణన, కూచిపూడిలో నదీ రూపంతో - పరబ్రహ్మ స్వరూపమైన సాగరంలోకి - ఒంపుసొంపులతో సరస్వతి ప్రయాణం, మైసూర్ భరతనాట్యంలో శివకామ సుందరిగా అమ్మవారి మూర్తి-శక్తి వర్ణన, ఒడిస్సీలో 'వారాహీ రక్షతు మాం ' అంటూ వారాహి రూపంలో అమ్మవారి ఆరాధన, కథక్ లో కాళీమాత శక్తి స్వరూప పరమార్థం, మోహినీయాట్టం + భరతనాట్యంలో 'శ్రీగజలక్ష్మి చింతయామ్యహం ', భరతనాట్యంలో 'నీ కాలిగోటి రాకా సుధాంశువులు ' అంటూ అమ్మవారి శక్తివర్ణన, భరతనాట్యంలో 'అగజాధరమున నగవులవే, సిగపై వెన్నెల చిన్నబోయెరా..' అంటూ అమ్మవారి చిరునవ్వుల కాంతి వర్ణన .., ఇంకా శివ శివాని ఛిద్రస రూపా,   పాయసాన్న ప్రదాత కాశీ అన్నపూర్ణ, ఆది పరాశక్తి తత్త్వం తదితర నృత్య రూపాల్లో ప్రతి ఒక్కటీ - నేపథ్యంలో గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, మల్లాది సూరిబాబు వంటి గాయకుల గాత్రంతో - ప్రేక్షకుల్ని భక్తి తన్మయుల్ని చేశాయి.  

ముఖ్యంగా 'అమ్మా వాణి అక్షర వాణి...' అంటూ మనస్విని (రెండు రోజుల వ్యవధిలో సాధన చేసిన) అణువణువునా భక్తి భావన పలికించే అభినయంతో, ముద్రలతో, మెరుపు వేగంతో చేసిన నృత్యం ప్రేక్షకుల్ని ఎంత మంత్రముగ్ధుల్ని చేసిందంటే, ఒక్కసారిగా అందరూ లేచి నిలబడి కరతాళధ్వనులతో (Standingg Ovation) హర్షం వ్యక్తం చేశారు.   "సరస్వతి దేవిని ఇక్కడ మనస్విని సాక్షాత్కరింపజేసింది " అని షణ్ముఖ శర్మ ప్రశంసించారు.ఒడిస్సి + భరతనాట్యంలో కళాకారుల బృందం  'శివుడు ధరించిన మాతృరూపమిది..' అంటూ నయనాందకరంగా ప్రదర్శించిన శివ-శక్తి రూపాల వర్ణన కూడా ప్రేక్షకుల్ని తన్మయుల్ని చేసింది. 

మిల్పిటాస్ నగర మేయర్ కార్మెన్ మొంటానో భారతీయ నృత్య రీతులను ప్రశంసించారు.  షణ్ముఖ శర్మ  నిర్వాహకులకు మల్లాది రఘు బృందాన్ని, శివవిష్ణు ఆలయ కమిటీని అభినందించారు. ముఖ్యంగా వేయికి పైగా శివపదాల్లోంచి ఎంపిక చేసిన వాటికి  వాణి గుండ్లాపల్లి 12 దేశాల్లో ఇలా భారతీయ నృత్య రీతుల్లో ప్రదర్శనలు నిర్వహిస్తూండాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఇప్పుడు పారిస్ నగరంలోకూడా వాణి ప్రదర్శన ఇవ్వబోతున్నారని ప్రకటించారు.

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)