Breaking News

నాట్స్ సంబరాల్లో సరికొత్త సాహిత్య కార్యక్రమాలు

Published on Fri, 04/04/2025 - 12:40

అమెరికాలోని టంపాలో జూలై 4.5,6 తేదీల్లో జరిగే 8 వ నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో ఈసారి సరికొత్త సాహిత్య కార్యక్రమాలు ఉంటాయని ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్ అవార్డ్ విజేత చంద్రబోస్ తెలిపారు. భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో తెలుగు భాష కోసం నాట్స్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. అమెరికా తెలుగు సంబరాల్లో తనతో పాటు వచ్చే తెలుగు రచయితలతో కలిసి సరికొత్త సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.  

హైదరాబాద్‌లో నాట్స్ సంబరాలకు విచ్చేసే అతిధుల ఆత్మీయ సమ్మేళనంలో చంద్రబోస్ మాట్లాడారు. సంబరాల్లో సాహిత్య పరిమళాలు వెదజల్లడానికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. నాట్స్‌తో తనకు ఎంతో కాలంగా అనుబంధం ఉందని.. గతంలో కూడా నాట్స్ సంబరాలకు వెళ్లానని  ప్రముఖ సినీ సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి అన్నారు. సంబరాల సాహితీ కార్యక్రమాల్లో కచ్చితంగా పాలుపంచుకుంటానని తెలిపారు.. నాట్స్ సంబరాలకు తనను ఆహ్వానించడం సంతోషంగా ఉందని ప్రముఖ గేయ రచయిత త్రిపురనేని కల్యాణ్ చక్రవర్తి అన్నారు. సంబరాల్లో తెలుగు సాహిత్య సదస్సుల్లో పాల్గొనే అవకాశం రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ 8 వ అమెరికా తెలుగు సంబరాలకు అందరూ కుటుంబసమేతంగా రావాలని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి పిలుపునిచ్చారు.

మరిన్ని  NRI  వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి! 

అమెరికా తెలుగు సంబరాలను దిగ్విజయంగా నిర్వహించేందుకు 300 మంది సంబరాల కార్యవర్గ కమిటీ సభ్యులు ఇప్పటినుంచే ముమ్మరంగా కృషి చేస్తున్నారు. సంబరాల్లో తెలుగు భాష ప్రేమికులను ఆకట్టుకునే విధంగా అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నామని నాట్స్ సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది తెలిపారు.

Videos

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

జైలర్ 2 పై అల్లు అర్జున్ షాకింగ్ ట్వీట్ వైరల్

ప్రభాస్ బర్త్‌డే స్పెషల్... కల్కీ 2 నుంచి అదిరిపోయే వీడియో

వైఎస్ షర్మిలకు వైఎస్ జగన్ లేఖ

మే. 2029 వరకు మీరు తగ్గకండి నేను తగ్గను... నేను చాగంటి లా ప్రవచనాలు చెప్పే రకం కాదు

భయపడేవాడు ఎవడూ లేడు... కోయ ప్రవీణ్.. ఖాకీ డ్రెస్ బదులు టీడీపీ జెండా కట్టుకో

RC 17 పై క్లారిటీ ఇచ్చిన సుకుమార్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)