Breaking News

ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతిపై నాట్స్‌ సంతాపం

Published on Wed, 07/16/2025 - 17:06

ప్రముఖ నటుడు పద్మశ్రీ కోట శ్రీనివాసరావు మరణ వార్త పట్ల ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. 750 సినిమాల్లో ఎన్నో విలక్షణమైన పాత్రలను పోషించిన కోట తెలుగు వారి మనస్సుల్లో చెరిగి పోని ముద్ర వేశారని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అన్నారు. తండ్రిగా, తాతగా, కామెడీ విలన్‌గా, పోలీసుగా, మాంత్రికుడిగా ఎన్నో పాత్రలను పోషించిన కోటను తెలుగు వారు ఎన్నటికి మరిచిపోలేరని ఓ ప్రకటనలో తెలిపారు. కోట మృతి పట్ల నాట్స్ ప్రగాఢ సంతాపాన్ని వెలిబుచ్చింది. కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నామని నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి తెలిపారు.
కాగా ‘కోట’గా పాపులర్‌ అయిన నటుడు కోట శ్రీనివాసరావు (83)  జూలై 13 తెల్లవారుజామున హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్ నగర్‌లోని తన నివాసంలో కన్నుమూసారు. 83వ పుట్టినరోజు జరుపుకున్న కేవలం మూడు రోజులకే ఆయన మరణించడం తీవ్ర విషాదాన్ని  నింపింది. ఒక శకం ముగిసింది అంటూ పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. 

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)