Breaking News

నాట్స్ వినూత్న సేవ కార్యక్రమం

Published on Tue, 08/18/2026 - 11:37

భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ మిస్సోరీ చాప్టర్ సభ్యులు వినూత్నంగా సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాజ శ్రేయస్సే ధ్యేయంగా సెయింట్ లూయిస్ ప్రాంతీయ ఫుడ్ బ్యాంకాక్‌లో జరిగిన ప్రత్యేక ఆహార సేకరణ, ప్యాకేజింగ్ కార్యక్రమంలో నాట్స్ టీమ్ చురుగ్గా పాల్గొని సేవలు అందించింది.  

పేదలు, నిరుపేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాట్స్ వాలంటీర్లు, తెలుగు కుటుంబాలు స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. ఈ సేవా కార్యక్రమంలో నాట్స్ నార్త్ సెంట్రల్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ సందీప్ కొల్లిపర, నాట్స్  మిస్సోరీ చాప్టర్ జాయింట్ కోఆర్డినేటర్ అన్వేష్ చాపరాలలతో పాటు చాప్టర్ ప్రతినిధులు మధుసూధన్ దడ్డాల, నరేష్ రాయంకుల తదితరులు  పాల్గొని తమ వంతు సహాయ సహకారాలు అందించారు. 

తెలుగు సమాజానికి, అలాగే స్థానిక అమెరికన్ సమాజానికి సహాయం చేయడంలో నాట్స్ ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా నాట్స్ నాయకులులు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఆకలితో ఉన్నవారికి బాసటగా నిలవడం ఎంతో తృప్తినిచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాట్స్ వాలంటీర్లకు, నాట్స్ సభ్యులకు నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, నాట్స్ అధ్యక్షుడు రాజ్ అల్లాడ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

(చదవండి: సేవే జీవిత ధ్యేయంగా.. శోభా, ప్రసాద్ రెడ్డి దంపతుల సేవా ప్రస్థానం)

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)