మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు
Breaking News
బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
కూకట్పల్లి జేఎన్టీయూలో విద్యార్థుల ఘర్షణ
ఇస్రో: జీఎస్ఎల్వీ-ఎఫ్17 సక్సెస్.. నింగిలోకి ‘నిఘా నేత్రం’
చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్.. ప్రపంచ రికార్డులు
ఒక్క పోటుతో.. చిన్నారెడ్డి ఫస్ట్ రియాక్షన్
సురేఖ బర్తరఫ్.. కొండా మురళి సంచలన ట్వీట్
ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన చాట్‌జీపీటీ, జెమిని ఏఐ
మోదీకి ఆ కానుక ఇవ్వాలనుకున్నా.. కానీ ఏమైందంటే?
శ్రీకాంత్ అద్భుత విజయం.. సుదీర్ఘ నిరీక్షణకు తెర
హైదరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపులు.. ఈ రూట్లలో వెళ్తున్నారా?
వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన చంద్రబాబు
అగార్కర్ అందుకే రాలేదు.. రోహిత్ గురించి ఎందుకు?: బీసీసీఐ
‘బీజేపీ నేతలు సమాధానం చెప్పాల్సిందే’
రేవంత్‌రెడ్డిని శపిస్తున్నాను: కొండా సుస్మిత సంచలనం
తెలంగాణ సీఈఓ సుదర్శన్‌రెడ్డికి ‘సర్’ నోటీసులు
మీసం మెలేసిన కొండా మురళి
స్త్రీవాద దిగ్గజం, ప్రముఖ జర్నలిస్టు, రచయిత్రి కన్నుమూత
గతంలోనూ మంత్రులు బర్తరఫ్.. ఎవరెవరు? ఎప్పుడెప్పుడంటే?
తెలంగాణ రాజకీయాల్లో నెక్ట్స్ ఏంటి?
కొండా సురేఖ వివాదం.. ఎలా మొదలైంది? ఎప్పుడేం జరిగింది?
NRI: బ్లూమింగ్‌టన్‌లో నాట్స్ చాప్టర్ ప్రారంభం
Published on Mon, 06/23/2025 - 11:23
బ్లూమింగ్‌టన్: అమెరికాలో తెలుగు వారికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ మరింత చేరువ అవుతుంది. తెలుగు వారు ఎక్కడ ఉంటే అక్కడ నాట్స్ విభాగాలను ప్రారంభిస్తున్నారు. క్రమంలోనే తాజాగా ఇల్లినాయిస్ రాష్ట్రంలోని బ్లూమింగ్టన్ - నార్మల్ జంట నగరాల్లో నాట్స్ చాప్టర్ ప్రారంభమైంది.

ఈ కార్యక్రమంలో దాదాపు ఎనభై మంది తెలుగు ప్రజలు నాట్స్ చాప్టర్ ప్రారంభంలో పాల్గొన్నారు. బ్లూమింగ్టన్ చాప్టర్ సలహాదారులకా వేణుకుమార్ మద్దినేని, కృష్ణ వైట్ల వ్యవహరిస్తున్నారు. నాట్స్ బ్లూమింగ్టన్ చాప్టర్ కో ఆర్డినేటర్ బాధ్యతలను విజయ్ కృష్ణ చింటాకు నాట్స్ అప్పగించింది. బ్లూమింగ్టన్ నాట్స్ చాప్టర్ జాయింట్ కో ఆర్డినేటర్లుగా ప్రేమేష్ గోగినేని, భరత్ అబ్బూరి, మహిపాల్ రెడ్డి గసిరెడ్డి లను నియమించింది. నాట్స్ బ్లూమింగ్‌టన్ మహిళా సమన్వయకర్తగా సుష్మ గుడ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

నాట్స్ చేపడుతున్న కార్యక్రమాలను నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని వివరించారు. అమెరికాలో తెలుగువారికి ఏ కష్టం వచ్చినా నాట్స్ అండగా నిలబడుతుందని నాట్స్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి అన్నారు. స్థానికంగా ఉన్న తెలుగు సంఘాల సహకారంతో నాట్స్ విభాగం కార్యక్రమాలు చేపడుతుందని బ్లూమింగ్‌టన్ నాట్స్ నాయకులు తెలిపారు. స్థానికంగా ఉండే తెలుగు వారికి సేవలు అందించేందుకు నాట్స్ బ్లూమింగ్‌టన్ టీంను సిద్ధం చేసేలా ఈ చాప్టర్ ప్రారంభంలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.

ఇంకా ఈ కార్యక్రమంలో బ్లూమింగ్టన్ - నార్మల్ జంట నగరాల తరపున ప్రాతినిధ్యం వహించబోతున్న వారి ఆలోచనలను ఈ కార్యక్రమలో పంచుకున్నారు. నాట్స్ సేవా కార్యక్రమాలను బ్లూమింగ్‌టన్ లో చేపట్టేందుకు కార్యాచరణ ప్రణాళికపై నాట్స్ నాయకులు చర్చించారు.
#
Tags : 1