Breaking News

జొన్నలగడ్డ రాంభొట్లు - సరోజమ్మ స్మారక సిరికోన నవలారచన పోటీ తుది ఫలితాలు

Published on Fri, 06/27/2025 - 14:50

 

తెలుగులో గుణాత్మకమైన నవలారచనలను ప్రో త్సహించడానికి సిరికోన సాహితీ అకాడెమీ ( వాట్సప్) తరపున, స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు - సరోజమ్మ  నవలా రచన  పోటీ 2024కు సంబంధించిన తుది ఫలితాలను సంస్థ ప్రకటించింది.  గత నాలుగు సంవత్సరాల నుంచి, ప్రతి ఏడాదీ ఉత్తమ నవలారచన పోటీల్లో భాగంగా ఉత్తమ రచనకు ముప్ఫై వేల నగదు బహుమతితో కూడిన పురస్కారాన్ని అందిస్తుంది., ఇతర రచయితలకు ప్రోత్సాహకంగా ఒకటి రెండు ప్రత్యేక బహుమతులను కూడా ప్రకటిస్తుంది. 

2024 వ సంవత్సరానికి అనూహ్యమైన స్పందన లభించింది.. ఎక్కువమంది ప్రేమను కేంద్రవస్తువుగా తీసుకుని   రాసినా, గణనీయ సంఖ్యలో ఆధునిక జీవన వైవిధ్యాన్ని చిత్రించే నవలలు రచించి పోటీకి సమర్పించారు.. ప్రాథమిక వడబోత పిమ్మట 26 నవలలు పోటీకి నిలిచాయి. తర్వాత వాటిని మరొక నిర్ణేత పరిశీలించి ఎంపిక చేసిన 7 నవలలను ముగ్గురు న్యాయనిర్ణేతలకు పంపడం జరిగింది.  a. కథావవస్తువు, b. ఇతివృత్త నిర్మాణం- వాస్తవికత/ తార్కికతలు, c. శైలి- శిల్పం, d. సామాజిక ప్రయోజనం  అంశాల ఆధారంగా  గుణ పరిశీలన జరిగిందని సంస్థ ప్రతినిధి జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. 

 ఉత్తమ నవల:  'కిలారి': డా.బి.నాగశేషు

ప్రత్యేక బహుమతులు:
             1. “కావేరికి అటూ ఇటూ”: రెంటాల కల్పన
             2. “ లింగాల కంఠంలో” : రంజిత్ గన్నోజు

అసాధారణ నిర్మాణచాతురితో, అద్భుత మాండలిక భాషా కథనంతో, సమగ్ర గ్రామీణ జీవితాన్ని ఆవిష్కరిస్తున్న నవల 'కిలారి, మూడుతరాల నారీచేతనకు అద్దం పడుతున్న రచన 'కావేరికి అటూ ఇటూ..', నల్లమల  అడవుల్లోని  చెంచుల  జీవితాన్ని  అత్యంత సన్నిహితంగా పరిచయం చేస్తున్న రచన 'లింగాలకంఠంలో నవలలు నిస్సందేహంగా  సిరికోనకు  గర్వకారణంగా నిలిచే రచనలని పేర్కొంది.   విజేతలకు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం  అభినందనలు  తెలిపారు.

మరిన్ని  NRI  వార్తలకోసం ఇక్కడ క్లిక్‌ చేయండి
 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)