అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడి ఉపనయన వేడుక
Breaking News
యోగా, వంట మాస్టర్లకు ఆస్ట్రేలియా బంపర్ ఆఫర్
Published on Mon, 04/04/2022 - 18:54
యోగా గురువులు, వంట చేయడంలో చేయి తిరిగిన చెఫ్‌లకు ఆస్ట్రేలియా ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ రెండు రంగాలకు చెందిన వారిని ప్రత్యేకంగా పరిగణిస్తూ వీసాలు జారీ చేస్తామని తెలిపింది. ఇప్పటి వరకు వంట మాస్టర్లు, యోగా గురువులు స్కిల్క్‌డ్ పర్సన్స్ కోటాలోనే ఆస్ట్రేలియా వీసాలు జారీ చేస్తోంది. దీని వల్ల వీసాలు పొందడానికి చాలా జాప్యం జరుగుతూ వస్తోంది.
ఇటీవల భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఆస్ట్రేలియా ఇండియా ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్(ఏఐఈసీటీఏ) కుదిరింది. అందులో భాగంగా యోగా గురువులు, చెఫ్‌లకు ప్రత్యేక వీసాలు జారీ చేస్తామని ఆస్ట్రేలియా టూరిజం మినిష్టర్ డాన్ తెహాన్ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య రాకపోకలు పెరిగినప్పుడే ఏఐఈసీటీఏ ప్రయోజనాలు నెరవేరుతాయని ఆయన తెలిపారు. ఈ వీసాల జారీకి సంబంధించిన నియమ నిబంధనలు త్వరలో ప్రకటించనున్నారు.
Tags : 1