Breaking News

రూ. 1.6 కోట్ల జీతం, అయినా అమెరికాలో ఇండియన్‌ టెకీ జీవితం ఇదీ!

Published on Thu, 07/10/2025 - 17:13

అమెరికాలో కొలువు, అదీ ఐటీ కంపెనీలో ఉద్యోగం అనగానే ఏడంకెల జీతం... లైఫ్‌ సెట్‌ అనుకుంటాం.  కోట్ల  రూపాయలు,  తక్కువలో  తక్కువ లక్షల రూపాయల ప్యాకేజీ, లగ్జరీ లైఫ్‌ అని భావిస్తాం కదా. కానీ న్యూయార్క్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న  ఒక భారతీయ యువతి అనుభవం వింటే మాత్రం ‘అవునా.. నిజమా’అని ఆశ్చర్యపోక తప్పదు. 

ప్రముఖ సెర్చి ఇంజీన్‌ కంపెనీ గూగుల్‌లో  న్యూయార్క్ నగరంలో  టెకీగా పనిచేస్తోంది ఇండియాకు చెందిన మైత్రి మంగళ్. ఆమె జీతం ఏడాదికి రూ.1.6 కోట్లు.  పాడ్‌కాస్టర్, రచయిత కుశాల్ లోధాతో, మంగళ్  అమెరికాలో  జీతం, నెలవారీ ఖర్చుల గురించి చేసిన చర్చ ఇపుడు నెట్టింట  వైరల్‌గా మారింది. నెల ఖర్చులు, తిండి, ఇంటి అద్దె ఖర్చులతో పోలిస్తే ఇది ఎంత అంటూ  తన గోడును వెళ్లబోసుకుంది.

ఈ వివరాలను  లోధా సోషల్‌ మీడియాలో  షేర్‌ చేశారు. "Googleలో సగటు ప్యాకేజీ ఎంత? అని Googleలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మైత్రిని అడిగాను. సాధారణంగా రూ.1.6 కోట్లు ఉంటుందని పంచుకుంది" అని లోధా  చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరం న్యూయార్క్‌లో అపార్ట్‌మెంట్‌ అద్దె సుమారు రూ.2.5 లక్షలు. నెలవారీ ఖర్చురూ.4.2 లక్షలు. ఇది కాకుండా బయట తినడం, కిరాణా సామాగ్రి , ఎంటర్‌టైన్‌మెంట్‌  సహా  ఇతర ఖర్చులు సుమారు రూ. 85,684-రూ. 1,71,368 వరకు ఉంటాయి. ప్రయాణ ఖర్చులు  మరో రూ. 8,568-రూ. 17,136 దాకా అవుతాయి.

 

ఇది చూసిన నెటిజన్లు  ఔరా అంటూ నోరెళ్ల బెట్టారు.  భారీ జీతం,  న్యూయార్క్‌లాంటి గ్లోబల్‌ నగరాల్లో అసలైన జీవితం అంటూ కమెంట్స్‌ చేశారు.అన్నట్టు ఈ వీడియోనుమైత్రి మంగళ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ఆమెకు 173 వేల మంది అనుచరులు ఉన్నారు.

Videos

Weather: ఏపీకి భారీ వర్ష సూచన

YSR జిల్లా బద్వేల్‌లో అంగన్వాడి సెంటర్లకు పురుగుపట్టిన కందిపప్పు సరఫరా

మసూద్ అజహర్ ఆచూకీ పసిగట్టిన నిఘావర్గాలు

అక్రమంగా పేదవారి భూమి లాగేసుకున్న టీడీపీ ఎమ్మెల్యే

YSRCP ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించిన మున్సిపల్ అధికారులు

హైదరాబాద్ లో భారీ వర్షం

రాబర్డ్ వాద్రాపై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలుచేయడంపై స్పందించిన రాహుల్ గాంధీ

పదేళ్లు సెక్రటేరియట్ కు రాకుండా ప్రజలకు దూరంగా కేసీఆర్ పాలన చేశారు

భాను ప్రకాష్... వ్యక్తిగత వ్యాఖ్యలు సరికాదు: వరుదు కల్యాణి

రోజాపై భాను గాలి ప్రకాష్ వ్యాఖ్యలు YSRCP పూర్ణమ్మ ఉగ్రరూపం..

Photos

+5

హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన..చెరువుల్లా మారిన రోడ్లు (ఫొటోలు)

+5

‘నా సీతా సీమంతం’ శ్రీమతి సీమంతంపై బిగ్‌బాస్‌ ఫేం పోస్ట్‌ (ఫొటోలు)

+5

‘నేను నా శివయ్య’ అంటున్న ఈ భక్తురాల్ని చూశారా?

+5

చందమామలా.. చీర సింగారించుకుని క్యూట్‌గా తెలుగు బ్యూటీ!

+5

ఆంధ్రా సరిహద్దులో.. ఉరకలేస్తున్న జలపాతాలు(చిత్రాలు)

+5

కుమారుడితో తొలిసారి తిరుమలలో హీరోయిన్ ప్రణీత (ఫొటోలు)

+5

'పరదా' సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)

+5

రెడ్‌ శారీలో ‘జూనియర్‌’మూవీ ఈవెంట్‌లో మెరిసిన శ్రీలీల (ఫొటోలు)

+5

ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ సీజన్ 2 ట్రోఫీ ఆవిష్కరించిన సల్మాన్ ఖాన్ (ఫొటోలు)

+5

కరీంనగర్ లో సినీనటి అనుపమ పరమేశ్వరన్ సందడి (ఫొటోలు)