Breaking News

ఆరోగ్యం కోసం మైక్రోసాఫ్ట్‌ కెరీర్‌ని వదిలేసుకున్న సీఈవో..!

Published on Tue, 07/22/2025 - 18:01

ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్నారు కొందరు ప్రముఖులు. అందుకోసం అత్యున్నతమైన కెరీర్‌ని కూడా వదిలేస్తున్నారు. ఆ కోవకు చెందని వారే భారత సంతతికి చెందిన ఈ సీఈవో.  ఫిట్‌నెస్‌కి ప్రాధాన్యత ఇచ్చి మంచి కెరీర్‌కి స్వస్తి పలికిన వ్యక్తిగా వార్తల్లో నిలిచారాయన. ఎందుకిలా అంటే..

అమెరికాలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన సీఈఓ సుధీర్‌ కోనేరు ఐఐటీ మద్రాస్‌ పూర్వ విద్యార్థి. ఆరోగ్యవంతంగా జీవించాలని మైక్రోసాఫ్ట్‌లో సుమారు 15 ఏళ్ల విజయవంతమైన కెరీర్‌కు స్వస్థి పలికి రిటైరయ్యారు. ప్రస్తుతం ఆయన సియాటిల్‌కు చెందిన జెనోటీ అనే కంపెనీకి నాయకత్వం వహిస్తున్నారు. ఇది సెలూన్లు, స్పాలు, ఫిట్‌నెస్‌ కేంద్రాలకు మంచి వ్యాపార సాఫ్ట్‌వేర్‌ని అందిస్తుందట. 

అంతేగాదు 56 ఏళ్ల సుధీర్‌ మంచి ఆరోగ్యానికి పెద్దపీట వేసి మరీ బెంగళూరు బ్రీతింగ్‌ వర్క్‌షాప్‌లకు హాజరవుతారట. అందుకోసం సుమారు రూ. 1లక్ష నుంచి 1.6 లక్షలు ఖర్చు చేస్తారు. కేవలం నాలుగు రోజుల ఈ బ్రితింగ్‌ వర్క్‌షాప్‌లకు ఆయన ప్రతి ఏడాది రూ. 3.5 లక్షల వరకు ఖర్చు చేస్తారట. ఈ సెషన్లలో ఆధ్యాత్మిక శ్వాస పద్ధతులకు సంబంధించి రెండు గంటల గైడ్‌లైన్స్‌, ధ్యానాలు ఉంటాయట. వాటిని సుధీర్‌ శరీరాన్ని అద్భుతంగా నయం చేసేవి, చాలా శక్తిమంతమైనవిగా పేర్కొంటారాయన.

మైక్రోసాఫ్ట్‌లో సుధీర్‌ ప్రస్థానం..
సుధీర్‌ 1992లో మైక్రోసాఫ్ట్‌ ప్రొడక్ట్‌ మేనేజర్‌గా కెరీర్‌ ప్రారంభించి..జస్ట్‌ ఎనిమిదేళ్లకే 2000లో తన సొంత కంపెనీ ఇంటెలిప్రెప్‌ను ప్రారంభించారాయన. సరిగ్గా 2008లో అంటే 39 ఏళ్ల వయసులో కెరీర్‌ మంచి పీక్‌ పొజిషన్లో ఉండగా యోగా, వాకింగ్‌, జాగింగ్‌ వంటి ఫిట్‌నెస్‌ కోసం కంపెనీని విడిచిపెట్టారు. తాను ఆర్థికంగా ఉన్నత స్థితిలోఉన్నా..కానీ ప్రస్తుత లక్ష్యం కేవలం తన వ్యక్తిగత శ్రేయస్సు తోపాటు కుటుంబంతో బలమైన బంధాలు ఏర్పరుచుకోవడమేనని చెబుతున్నారు సుధీర్‌. 

వర్క్‌ పరంగా తాను చాలా బెస్ట్‌ కానీ, కేవలం డబ్బు సంపాదించడమే కాదు..అంతకుమించి తన కోసం సమయం కేటాయించాలని, అప్పుడే ఆరోగ్యంగా ఉండగలమని గ్రహించానంటాడు సుధీర్‌. అందుకోసమే రెండేళ్ల సుదీర్థ సెలవుల అనంతరం మైక్రోసాఫ్ట్‌ కంపెనీని నుంచి పదవీ విరమణ చేసి జెనోటిని స్థాపించానని తెలిపారు. తన కంపెనీ సంస్కృతిలో వెల్నెస్‌ సూత్రాలు అందించడానికి ప్రయత్నిస్తున్నాడు. 

అంతేగాదు తన సంస్థ పని సమయంలో యోగా, కిక్‌బాక్సింగ్‌, పైలేట్స్‌, వంటి ఫిట్‌నెస్‌ తరగతులను నిర్వహిస్తుంది. ఉద్యోగులు వీటిలో పాల్గొని వర్కౌట్లు చేసినట్లయితే మంచి పారితోషకం కూడా పొందుతారట. అంతేగాదు తన ఉద్యోగులకు స్పా, సెలున్లలో మంచి మసాజ్‌లు, ఆరోగ్యకరమైన స్నాక్స్‌ వంటివి కూడా అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు. ఇ​క తన దృష్టిలో ఫిట్‌నెస్‌ అంటే సిక్స్‌ ప్యాక్‌ని కలిగి ఉండటం కాదట. 

సమతుల్యమైన ఆహారంతో మంచి సామర్థ్యంతో జీవించడమే తన ధ్యేయమని చెబుతున్నారు. ఇక సుధీర్‌ వీక్‌ఆఫ్‌లతో సహా వారం రోజులు ఉదయమే ఏడింటికే యోగా చేస్తారట. బాలికి వెళ్లి కొన్నిరోజులు రెస్ట్‌ తీసుకుంటారట. అక్కడ మసాజ్‌లు, సన్‌బాత్‌ వంటి చికిత్సలు తీసుకుంటారట. అలాగే బెంగళూరులోని నాలుగు రోజుల శ్వాస వర్క్‌షాప్‌లో కూడా పాలుపంచుకుంటారట.

(చదవండి: 56 ఏళ్ల తర్వాత స్కూల్‌కి వెళ్తే..! పెద్దాళ్లు కాస్తా చిన్నపిల్లల్లా..)

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)