Breaking News

న్యూయార్క్ వీధుల్లో ఉప్పొంగిన భారతీయత

Published on Mon, 08/25/2025 - 16:33

న్యూయార్క్:  న్యూయార్క్ నగరంలో ఎఫ్.ఐ.ఏ ఆధ్వర్యంలో  జరిగిన 79వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ నేనుసైతం అంటూ పాల్గొని మాతృభూమి పట్ల మమకారాన్ని చాటింది. నాట్స్ నాయకులు, సభ్యులు పాల్గొని జన్మభూమి పట్ల తమకు ప్రేమను ప్రదర్శించారు. స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్‌లో తెలుగు ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ, ప్రముఖ నటి రష్మిక కూడా పాల్గొని ఈ పరేడ్‌కు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చారు. ఈ ఉత్సవాల సందర్భంగా ఎఫ్.ఐ.ఏ ఏర్పాటు చేసిన ర్యాలీలో నాట్స్ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇరు తెలుగు రాష్ట్రాల సాంస్కృతిక, సామాజిక పరిస్థితులను ప్రతిబింబించేలా ఉన్న ఈ శకటం అందరి దృష్టిని ఆకర్షించింది. 

ఈ కార్యక్రమంలో నాట్స్ పూర్వ చైర్ విమెన్ అరుణ గంటి, నాట్స్ అధ్యక్షుడు శ్రీ హరి మందాడి, బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలి, నాట్స్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ హరినాథ్ బుంగటావుల, బోర్డ్  డైరెక్టర్  వెంకట్ శాఖమూరి, నాట్స్ జాయింట్ సెక్రటరీ రామ్ నరేష్ కొమ్మనబోయిన, నాట్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ (మీడియా) మురళీ కృష్ణ మేడిచెర్ల, నాట్స్ నాయకులు నేషనల్ కోఆర్డినేటర్ (మార్కెటింగ్) కిరణ్ మందాడి, నార్త్ ఈస్ట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మెంట, న్యూ జెర్సీ చాప్టర్ కోఆర్డినేటర్ కుమార్ వెనిగళ్ల, కో- కోఆర్డినేటర్ ప్రసాద్ టేకి,  న్యూ జెర్సీ చాప్టర్ అడ్వైజర్ వంశీ కృష్ణ వెనిగళ్ల, శ్రీకాంత్ పొనకాల, శంకర్ జెర్రిపోతుల, శ్రీదేవి పులిపాక, గాయత్రి చిట్లేటి, గీత, కృష్ణ నెక్కంటి, రాకేష్ వేలూరు,సూర్య గుత్తికొండ, సురేష్ బొల్లు, సురేష్ బొందుగుల, DJ శేఖర్ తదితరులు ఈ పరేడ్‌లో పాల్గొన్నారు. నాట్స్ సభ్యులు, నాట్స్ కుటుంబ సభ్యుల చిన్నారులు ఈ  పరేడ్‌లో చేసిన ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి.  

తారిక, తన్వి లు చేసిన టాలీవుడ్ డాన్స్, సింధూర చేసిన క్లాసికల్ నృత్యం విశేషం గా ఆకర్షించాయి. రంగ మేడిశెట్టి చేసిన కృష్ణ వేషధారణ, భాగవత సందేశాలు కూడా అందరినీ బాగా ఆకట్టుకున్నాయి. భారత్ మాతా కీ – జై! వందేమాతరం! జై హింద్ వంటి నినాదాలతో న్యూయార్క్ నగరం హోరెత్తింది. మువ్వెన్నెల జెండా రెపరెపలాడింది. చక్కటి సమన్వయంతో న్యూ జెర్సీ, ఫిలడెల్ఫియా చాప్టర్స్ నుంచి వచ్చిన నాట్స్ మిత్రులందరికీ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, అధ్యక్షుడు శ్రీహరి మందాడి అభినందనలు తెలియచేసారు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)