Breaking News

చాయ్‌వాలాగా ఐటీ ఉద్యోగి..!

Published on Mon, 03/09/2026 - 13:44

ఐఐటీ విద్యార్థి చాయ్‌ అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. అది కూడా అమెరికాలో. ఈ భారత సంతతి వ్యక్తి కథ నెట్టింట సెన్సేషన్‌గా మారింది. ఈ టెకీ కథ ప్రతి ఒక్కర్ని కదలించడమే కాదు, ఆలోచింపచేసేలా చేసింది. 

అతడే చాయ్‌వాలా లేదా చాయ్‌గుయ్‌గా ప్రసిద్ధి చెందిన ప్రభాకర్‌ ప్రసాద్‌. బిహార్‌  పాట్నా సమీపంలోని బార్‌ అనే చిన్న పట్టణానికి చెందిన ప్రభాకర్‌ ఈ ఫిబ్రవరి 2025లో టెక్‌ లేఆఫ్‌లు నేపథ్యంలో అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో చాయ్‌స్టాల్‌ని ప్రారంభించి ఒక్కో టీ కప్పుని రూ. 780లకు విక్రయిస్తున్న  అతడి కథ నెట్టింట వైరల్‌ అవ్వడంతో..ఒక్కసారిగా అతడి బిజినెస్‌ కూడా లాభాసాటిగా పుంజుకోవడం విశేషం. 

ఎక్కడో బిహార్‌ నుంచి అగ్రరాజ్యం అమెరికాకు ఎలా వలస వచ్చాడంటే.. నిజానికి ప్రభాకర్‌ కుటుంబం కడు పేదరికంతో ఇక్కట్లు పడుతుండేది. కనీసం దుప్పట్లు కూడా కొనుక్కోలేని దారుణ పరిస్థితి. దాంతో వాళ్లు శీతాకాలం వచ్చిందంటే చాలు వెచ్చదనం కోసం పప్పుబస్తాల కింద నిద్రించేవారట. 

ప్రభాకర్‌ తండ్రి అనేక వ్యాపారాలు చేసినా..ఎందులోనే విజయం సాధించలేకపోయేవాడట. కానీ అతడి తల్లిదండ్రులు విద్య శక్తిని మాత్రం గట్టిగా విశ్వసించేవారట. ఇక ప్రభాకర్‌ చిన్నతనంలో బిహార్‌లోని ఓ హిందీ పాఠశాలలో చదువుకున్నాడు. అక్కడ ప్రభాకర్‌  క్లాస్‌ ఫస్ట్‌, లీడర్‌ కూడా. క్రికెట్‌ దగ్గర నుంచి పాటలు పాడటం వరకు అన్నింట్లోనూ మనోడే ఫస్ట్‌. అయితే తన సోదరుడు కిడ్నాప్‌కి గురవ్వడంతో తన జీవితం అనూహ్యమైన మలుపులు తిరిగిందని చెబుతున్నాడు. 

తన కుటుంబం అకస్మాత్తుగా బీహార్‌ వదిలి భోపాల్‌కు వెళ్లిపోయింది. ఆ మార్పుని తట్టుకోవడం చాలా కష్టంగా అనిపించింది ప్రభాకర్‌కి. భోపాల్‌లో తోటి విద్యార్థులంతా ఇంగ్లీస్‌లో అనర్గళంగా మాట్లాడంతో..తన ఆంగ్లయాసను చూసుకుని అంత నవ్వేవారంటూ నాటి ఘటనను గుర్తుచేసుకున్నాడు. బిహార్‌ బోర్డు స్కూల్‌ నుంచి ఇంగ్లీష్‌ సీబీఎస్‌ఈ స్కూల్‌ వరకు కనీసం ప్రాథమిక పదాలు అర్థమయ్యేవి కాదని చెప్పుకొచ్చాడు. అయితే కష్టపడి ఏదో రకంగా నేర్చుకున్నానని, అలా ఐఐటీ స్క్రీనింగ్‌ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యానని చెప్పుకొచ్చారు. 

ఐఐటీ అడ్మిషన్‌ తన జీవిత గమనాన్ని మార్చిందని చెబుతున్నాడు. ఐఐటీ పూర్తి అయిన వెంటనే 2008లో మొట్టమొదటి ఉ‍ద్యోగాన్నిపొందాను, అయితే టెక్‌ ప్రపంచం నాకెందుకో అంతగా నచ్చలేదు. కోడింగ్‌ నన్ను ఎప్పుడు ఉత్సాహపరచలేదని అంటున్నాడు. దాంతో అక్కడి కార్పొరేట్‌ ఒత్తిడి తట్టుకునేందుకు జిమ్‌లో గడుపుతుండేవాడినని, అలా బాడీబిల్డింగ్‌ తన అభిరుచిగా మారిందని అంటున్నాడు.  దాంతో కొత్తగా వేరే ఏదైనా ప్రయత్నించాలనే ఉద్దేశ్యంతో ముంబైకి వెళ్లి మోడలింగ్‌ ఆడిషన్‌లకు వెళ్తుండేవాడినని చెప్పుకొచ్చాడు. 

అలా మోడలింగ్‌లో రాణించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతుండగా అతడి స్నేహితురాలు అమెరికా వెళ్లిపోయింది. దాంతో ప్రభాకర్‌ కూడా అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కానీ వీసా రెండుసార్లు తిరస్కరణకు గురైంది. చివరికి 2014లో మాత్రమే ఎంబిఏ చేయడానికి యూఎస్‌ వెళ్లగలిగానంటూ తన గతాన్ని గుర్తుచేసుకున్నాడు. అయితే అనుకున్నంత అందంగా అమెరికా జీవితం ఉండదు అని తెలుసుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు. అక్కడ ఆరోగ్య సమస్యలు, పని ఇబ్బందులు తదితరాలన్నింటిని ఎదుర్కొన్నాడు. 

దాదాపు పదేళ్లు అమెరికాలో ఒక నగరం నుంచి మరొక నగరానికి తిరుగుతూనే ఉన్నానని, ఎన్నో కార్పొరేట్‌ ఉద్యోగాలు కూఆ చేశానని, అయితే తాను లేఆఫ్‌ వేటుకి గురయ్యానంటూ బాధగా చెప్పుకొచ్చాడు. ఇంతలో తన ఆరోగ్యం కూడా కుదుటపడింది. అయితే నా గమ్యం ఎటు వెళ్తుందో తెలియని ఈ అస్థిరతకు ఎలా చెక్‌ పెట్టాలా అని ఆలోచిస్తుండగా..ఒక స్నేహితుడి సూచన మేరకు చాయ్‌వాలాగా మారినట్లు చెప్పుకొచ్చాడు. తాను బిహారీ శైలి చాయ్‌​ అమ్ముతూ ఓ వీడియోని నెట్టింట పోస్ట్‌ చేశాను. ఇది తన వ్యాపార ప్రచారంలో భాగంగా చేశానని, అనుకున్నట్లుగా చాలామందికి ఆ వీడియో చేరువై వ్యాపారం కూడా పుంజుకుందని అంటున్నాడు ప్రభాకర్‌. 

అయితే కార్పొరేట్ జాబ్‌లలో పనిచేస్తున్నప్పుడు చేతినిండా డబ్బు ఉంది..స్వేచ్ఛ, ఆనందం లేకుండా పోయాయి. కానీ ఇవాళ్ల తన వద్ద డబ్బు తక్కువగానే ఉంది, కానీ స్వేచ్ఛ ఆనందం చాలా గరిష్టస్థాయిలో ఉన్నాయని అంటున్నాడు. అంతేగాదు తన స్వంత ఇష్టానికి తానే యజమానిని అని చెబుతున్నాడు కూడా. తాను కార్పొరేట్‌ బానిసను కాదని ఆత్మవిశ్వాసంగా చెబుతున్నాడు. గౌరవంగా బతకాలనుకుంటే..ఎంత చిన్న ఉద్యోగమైనా.. మంచిదే..అదే స్వేచ్ఛ, ఆనందం నిల్‌ అయితే కోట్లు గడించే ఉద్యోగమైనా వేస్టే కదా అని ప్రభాకర్‌ గాథ చూస్తే తెలుస్తోంది కదూ..!.

(చదవండి: ప్రసవానంతరం బరువు తగ్గాలంటే..! ఈ వర్కౌట్లు తప్పనిసరి..)
 

#

Tags : 1

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)