Breaking News

అమెరికాలో అందెశ్రీకి ఘన నివాళి

Published on Wed, 11/12/2025 - 22:31

ప్రజా కవి, గాయకుడు అందెశ్రీ అకాల మృతిపై అమెరికాలో ఘన నివాళి అర్పించారు. నార్త్ కరోలినా ఛార్లెట్ లో స్థిరపడిన తెలంగాణ ప్రవాసులు అందెశ్రీ మాట, పాటలను స్మరించుకున్నారు.

తెలంగాణ భూమి పుత్రుడిగా, నిస్వార్థ స్వరాష్ట్ర సాధన స్వాప్నికుడిగా అందెశ్రీని తెలంగాణ సమాజం కలకాలం గుర్తుపెట్టుకుంటుందని ఎన్.ఆర్.ఐ లు అభిప్రాయపడ్డారు. 

ఉద్యమ సమయంలో, ఆ తర్వాత కూడా ఆయన ప్రవాసులతో అత్మీయ అనుబంధాన్ని కొనసాగించారని కొనియాడారు.

అందెశ్రీ రచనలు, ఆయన గాత్రం చరిత్రలో నిలిచిపోయేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రవాసులు కోరారు. రానున్న తరాలకు ఆయన రచనలు పరిచయం అయ్యేలా పాఠ్య పుస్తకాల్లో చేర్చటంతో పాటు, అందెశ్రీ పేరుపై రాష్ట్ర స్థాయిలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ప్రత్యేక స్మృతివనం ఏర్పాటు చేయాలని ఈ సమావేశానికి హాజరైన  తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) – ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ వై. నరేందర్ రెడ్డికి విన్నవించారు.

అందెశ్రీని స్మరించుకోవటంతో పాటు, నివాళులు అర్పించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) అధ్యక్షుడు నవీన్ రెడ్డి మలిపెద్ది, కోర్ టీం సభ్యుడు, చార్లెట్ చాప్టర్ దిలీప్ రెడ్డి స్యాసని, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ నరేంద్ర దేవరపల్లి, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) చార్లెట్ చాప్టర్ అధ్యక్షుడు కదిరి కృష్ణ, చార్లెట్ తెలంగాణ అసోసియేషన్ (CTA) కార్యదర్శి ప్యారం పుట్టలి, తెలంగాణ ఎన్ఆర్ఐ ప్రముఖుడు పవన్ కుమార్ రెడ్డి కొండ, స్థానిక తెలంగాణ ప్రవాసులు హాజరయ్యారు.

Videos

విజయనగరంలో TDP, జనసేన మధ్య కొట్లాట

పెడితే స్టేషన్లో పెట్టు లేదంటే.. నరేన్ రెడ్డి నెక్స్ట్ లెవెల్ ర్యాగ్లింగ్

మున్సిపల్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. SECకి సుప్రీం కోర్ట్ సంచలన ఆదేశాలు

కడప ZP ఆఫీస్ వద్ద హైటెన్షన్.. BJP ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి హల్ చల్..

హౌస్ అరెస్టులతో అడ్డుకట్ట వేస్తారా? పోలీసులపై MLC రమేష్ ఫైర

YSRCP అభ్యర్థికి వార్నింగ్.. నామినేషన్లపై బెదిరింపుల ఆడియో వైరల్

మేయర్ గా గెలిచిన వెంటనే నేను చేయబోయే మొదటి పని...

రూ.5 లక్షలతో రూ.80 లక్షలు.. ఇదే ఆ సింపుల్ ట్రిక్

గాల్లో ఎగురుతూ ఆఫీసుకు! అమెరికా వ్యక్తి వెరైటీ జర్నీ..

గరివిడి లక్ష్మి చూసి.. పవన్, రవితేజ ఫిదా!

Photos

+5

బొమ్మలా అందంగా అదరగొట్టేస్తున్న గాయత్రి భరద్వాజ్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'జైలర్ 2' కాంత.. ఈమెని గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

అల్లు శిరీష్-నయనిక జపాన్ ట్రిప్ (ఫొటోలు)

+5

అపరంజి బొమ్మలా నభా నటేశ్ (ఫొటోలు)

+5

ఏపీలో ప్రసిద్ధి చెందిన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఎక్కడో తెలుసా?

+5

విజయవాడ : భవానీ భక్తులతో ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి (ఫొటోలు)

+5

విజయదశమి శుభాకాంక్షలు చెప్పిన సెలెబ్రెటీలు (ఫొటోలు)

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)