సింగపూర్‌లో ఘనంగా చండీ హోమ మహోత్సవం

Published on Sun, 09/28/2025 - 21:59

సింగపూర్: సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) ఆధ్వర్యంలో 28 సెప్టెంబర్ 2025 తేదీన దేవి కృపను స్మరించుకుంటూ చండీ హోమ మహోత్సవం ఘనంగా జరిగింది. సుమారు 350 మంది భక్తులు పాల్గొని, ఈ పవిత్ర హోమం ద్వారా చండీదేవి అమ్మ వారి ఆశీర్వాదాలను పొందారు. దేవి అనుగ్రహం కోసం ఈ చండీ హోమాన్ని సభ 30 సంవత్సరాలుగా నిరంతరంగా నిర్వహిస్తూ వస్తోంది.

కార్యక్రమం గణపతి పూజ మరియు కలశ స్థాపనంతో ఆరంభమైంది. అనంతరం గణపతి హోమం మరియు నవగ్రహ హోమం నిర్వహించబడింది. తదుపరి కవచ, అర్గళ, కీలక పఠనాలు చేసి, ఉత్సాహభరితమైన దేవీ మాహాత్మ్యం పరాయణ హోమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా సుహాసిని పూజ కూడా నిర్వహించి, పూర్ణాహుతి, దీపారాధన మరియు ఉపచార పూజలతో కార్యక్రమం ముగిసింది. దేవీ మాహాత్మ్యం ఘోషతో ఆ ప్రాంగణం అంతా పవిత్రతతో నిండిపోయి, భక్తులలో ఆధ్యాత్మిక భావన మేల్కొంది.

సభ తరపున వాలంటీర్లకు సత్కారం నిర్వహించారు. అలాగే ప్రాథమిక, మాధ్యమిక మరియు విశ్వవిద్యాలయ విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎడ్యుకేషన్ మెరిట్ అవార్డులతో సత్కరించారు. చివరగా భక్తులందరికీ పెరుమాళ్ దేవాలయం నుంచి తెప్పించిన   ప్రసాదం పంపిణీ చేయబడింది.

SDBBS అధ్యక్షులు కార్తిక్, కార్యదర్శి బాలాజీ రామస్వామి, ఈవెంట్ లీడ్ సాయి రామ్ కల్యాణసుందరం సభ పురోహితులు విజయ్, కన్నన్ మరియు కార్తిక్ లకు అలాగే కార్య‌క్ర‌మానికి తోడ్పడిన వాలంటీర్ల అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)