Breaking News

సిమ్రత్‌ కేసులో కెనడా పోలీసుల కీలక ప్రకటన

Published on Tue, 11/19/2024 - 09:04

భారత సంతతికి చెందిన యువతి గుర్‌సిమ్రత్‌ కౌర్‌(19).. ఓ ప్రముఖ స్టోర్‌లోని వాక్‌ ఇన్‌ ఒవెన్‌లో శవమై కనిపించడం తెలిసిందే. ఆమె మృతిపై తల్లితో సహా సహోద్యోగులు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఈ కేసు విచారణ జరిపిన కెనడా పోలీసులు తాజాగా కీలక ప్రకటన చేశారు. 

ఈ కేసులో దర్యాప్తు పూర్తైందని, అనుమానాస్పద హత్యగా అనిపించలేదని హాలీఫాక్స్‌ పోలీసులు సోమవారం ప్రకటించారు.  అలాగే.. తప్పు జరిగిందనడానికి ఆధారాలు కూడా లేవని వెల్లడించారు. ‘‘ఈ కేసులో ఏం జరిగిందో అనేదానిపై అనేక మంది అనేక ప్రశ్నలు లేవనెత్తారు. కానీ, మా విచారణలో అలాంటి అనుమానాలేవీ మాకు కనిపించలేదు. ఇందులో ఎవరి ప్రమేయం ఉన్నట్లు మాకు అనిపించడం లేదు. ఈ కేసు దర్యాప్తు పూర్తైంది’’ అని ఓ అధికారి వీడియో సందేశంలో తెలిపారు.

 

పంజాబ్‌కు చెందిన 19 ఏళ్ల గురుసిమ్రన్‌.. గత రెండేళ్లుగా తన తల్లితో కలిసి హాలీఫాక్స్‌లోని వాల్‌మార్ట్‌ షోరూంలో పని చేస్తోంది. తండ్రి, సోదరుడు భారత్‌లోనే ఉంటారు. అయితే కిందటి నెలలో.. వాక్‌ ఇన్‌ ఒవెన్‌లో ఆమె అనుమానాస్పద రీతిలో శవమై కనిపించింది.

సిమ్రన్‌ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ రావడంతో ఆమె స్టోర్‌ మొత్తం వెతికింది. చివరకు ఒవెన్‌ నుంచి పొగలు రావడం గమనించి స్టోర్‌ సిబ్బంది అనుమానంతో తెరిచి చూడగా అందులో కాలిపోయిన స్థితిలో గురుసిమ్రన్‌ మృతదేహం కనిపించింది. సిమ్రన్‌ మృతిపై తల్లి అనుమానాలు వ్యక్తం చేశారు. మరోవైపు ఆమెను బలవంతంగా అందులో ఎవరో నెట్టేసి హత్య చేసి ఉంటారని, వాక్‌ ఇన్‌ ఒవెన్‌ తలుపు లాక్‌ చేసి ఉండడమే తమ అనుమానాలకు కారణమని సిమ్రన్‌ సహోద్యోగులు చెప్పారు. కానీ, పోలీసులు మాత్రం అనుమానాలేవీ లేవని చెబుతుండడం గమనార్హం.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)